Allu Sirish : ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కొడుకు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు, హీరో అల్లు శిరీష్ జీవితంలో కొత్త చాప్టర్ మొదలైంది. రీసెంట్‌గానే ఆయన తన ప్రియురాలు నయనికతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. అక్టోబర్ 31న హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది. తాజాగా శిరీష్ తన ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో ఆయన వైట్ డ్రెస్‌లో, మెడకు నెక్లెస్ పెట్టుకుని స్టైలిష్‌గా కనిపించాడు.
Read Also : Prabhas : ప్రభాస్ పై హీరోయిన్ సంచలన కామెంట్స్.. అలా చేస్తాడంటూ..
అటు నయనిక ఎరుపు రంగు లెహంగాలో, ముత్యాల ఆభరణాలతో మరింత అందంగా మెరిసిపోయింది. అయితే ఆడవాళ్లు పెట్టుకున్నట్టు శిరీష్ ఇలా ఎందుకు నెక్లెస్ పెట్టుకున్నాడు అని అంతా ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా మగవారు ఇలాంటి నెక్లెస్ లు పెట్టుకోరు. పైగా హీరోగా ఉన్న శిరీష్ ఇలా ఎందుకు పెట్టుకున్నాడని అంతా చర్చించుకుంటున్నారు. పోనీ అల్లు వారి ఇంట్లో అలాంటి సంప్రదాయం ఏమైనా ఉందా అని ఆరా తీస్తున్నారు. ఏదేమైనా కొత్త జంటకు అంతా విషెస్ చెప్పేస్తున్నారు.
Read Also : SS Rajamouli : ప్రభాస్ ను అలాంటి బట్టల్లో చూసి షాక్ అయ్యా.. రాజమౌళి కామెంట్స్