NTV Telugu Site icon

Allu Ayaan: మోడల్.. మోడల్.. అల్లు మోడల్

Ayaan

Ayaan

Allu Ayaan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్ళికి ముందు ఎలా ఉన్నా .. పెళ్లి తరువాత బన్నీలో చాలా మార్పు వచ్చింది. అయితే సినిమా లేకపోతే కుటుంబం. ముఖ్యంగా బన్నీ.. తన పిల్లలతో ఎక్కుగా సమయం గడుపుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక బన్నీ గారాలపట్టి అల్లు అర్హ గురించి అందరికి తెల్సిందే. సోషల్ మీడియాలో ఒక చిన్నపాటి సెలబ్రిటీ హోదాను అర్హ అనుభవిస్తుంది. బన్నీతో అర్హ ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ కనిపించే వీడియోలు నెట్టింట ఎంతలా వైరల్ గా మారాయో అందరికి తెల్సిందే. ఇక బన్నీ కొడుకు అయాన్ మాత్రం అంత స్టార్ డమ్ ను తెచ్చుకోలేకపోయాడు. అర్హ చాలా అల్లరి పిల్ల. తెలివైంది. కానీ, అయాన్ చాలా సైలెంట్. అమ్మ కూచి. స్నేహ ఉన్నప్పుడే అయాన్ ఎక్కువ యాక్టివ్ ఉంటాడు. ఇక గత కొన్నిరోజులుగా అయాన్ సోషల్ మీడియాలో ట్రోల్ కంటెంట్ గా మారాడు. అయితే అది ఫన్ కోసమే అనుకోండి.

Meenakshi Chaudhary: ఇక్కడ మహేష్.. అక్కడ విజయ్.. ఏం లక్ పాప నీది

కరోనా సమయంలో అందరు బయట చప్పట్లు కొడుతుంటే.. ఆ సౌండ్ కు అయాన్ డ్యాన్స్ వేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఆ తరువాత.. బన్నీకి నేషనల్ అవార్డు ప్రకటించిన రోజున మీడియా మొత్తం శుభాకాంక్షలు చెప్పడానికి బన్నీ ఇంటికి వెళ్లారు. అక్కడ బన్నీకి వవిషెస్ చెప్తుంటే.. వెనుక అయాన్ గోడకు బల్లిలా అతుక్కొని కనిపించి నవ్వించాడు. ఇక ఇప్పుడు మరోసారి అయాన్ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. దసరా రోజున స్నేహ.. అర్హ, అయాన్ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ అందరికి శుభాకాంక్షలు తెలిపింది. ఇక ఆ ఫొటోలో అయాన్ .. ఫ్లోరల్ కుర్తీ వేసుకొని మోడల్ లా పోజిచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఈ ఫోటోను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మోడల్.. మోడల్.. అల్లు మోడల్ అంటూ క్యాప్షన్ పెట్టుకొస్తున్నారు.

Show comments