Site icon NTV Telugu

‘పుష్ప’రాజ్ కు మరో బ్రేక్… ‘అన్‌స్టాపబుల్’ ఎపిసోడ్ వాయిదా

Unstoppable

నందమూరి బాలకృష్ణ టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ వీక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఒక ఎపిసోడ్ అయిపోగానే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులను ఆతృతగా ఎదురు చూసేలా చేస్తోంది బాలయ్య హోస్టింగ్ నైపుణ్యం. ఈ ప్రముఖ టాక్ షో తాజా ఎపిసోడ్ లో బాలయ్యతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ సందడి చేయబోతున్నట్టుగా మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ఆ ఎపిసోడ్ డిసెంబర్ 25న అంటే రేపు ప్రసారం కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ షోలో అల్లు అర్జున్ ఎపిసోడ్ అనుకోని కారణాల వల్ల వాయిదా పడినట్టు సమాచారం. అల్లు అర్జున్ “పుష్ప ది రైజ్” బృందం ఈ క్రిస్మస్‌కు ప్రత్యేక ఎపిసోడ్ కోసం ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నా ఆయన అభిమానులకు తాజాగా షో నిర్వాహకులు చేసిన అనౌన్స్మెంట్ తో నిరాశ తప్పలేదు.

https://ntvtelugu.com/permission-denies-to-pushpa-massive-success-party-in-kakinada/

“అన్‌స్టాపబుల్ వినోదం కొనసాగుతుంది… కానీ చిన్న విరామంతో! ఊహించని పరిస్థితుల కారణంగా #UnstoppableWithNBK షోలో అందరూ అత్యంత ఆతృతగా ఎదురు చూస్తున్న ‘పుష్ప’ స్పెషల్ ఎపిసోడ్ రేపు విడుదల కాదని తెలియజేయడానికి చింతిస్తున్నాము. మీకు బెస్ట్ అందించడానికి మాత్రమే ఆలస్యం జరుగుతోంది. మేము మీకు ఖచ్చితంగా బెస్ట్ అందిస్తామని హామీ ఇస్తున్నాము!” అంటూ మేకర్స్ క్రిస్మస్ కానుకగా విడుదలవుతుంది అనుకున్న ఎపిసోడ్ వాయిదాపై వివరణ ఇచ్చారు. అల్లు అర్జున్ ఎపిసోడ్ 6 కాగా, నెక్స్ట్ ఎపిసోడ్ లో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కనిపించబోతున్నారు. ఇక ఇప్పటికే ఈరోజు కాకినాడలో జరగాల్సిన వేడుకకు అధికారుల నుంచి అనుమతి నిరాకరణ ఎదురవ్వడంతో బ్రేక్ పడిన విషయం తెలిసిందే.

Exit mobile version