Site icon NTV Telugu

HBD Allu Arjun : రూల్ చేయడానికి ‘పుష్ప’ రెడీ… కానీ ప్లాన్ చేంజ్

Pushpa

Pushpa

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి సెర్బియాలో ఉన్నాడు. రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్‌లతో అల్లు అర్జున్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇటీవల “పుష్ప” హిట్ ఇచ్చిన కిక్ ను ఎంజాయ్ చేస్తున్నారు బన్నీ. ఇక “పుష్ప 2″ను తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా “పుష్ప : ది రూల్” మేకర్స్ ఒక కొత్త పోస్టర్‌ను ఆవిష్కరించారు. అల్లు అర్జున్ “పుష్ప”రాజ్ అవతార్‌లో కనిపించడంతో పోస్టర్ వెంటనే అందరి దృష్టిని ఆకర్షించింది. రూల్ చేయడానికి ‘పుష్ప’ రెడీగానే ఉన్నాడు. కానీ ప్లాన్ లో చిన్న చేంజ్
జరిగినట్టు తెలుస్తుంది.

Read Also : Mahesh Babu : గోల్డెన్ హార్ట్… 30 మంది చిన్నారుల జీవితాల్లో వెలుగు

ఇప్పుడు అల్లు అర్జున్ “పుష్ప : ది రూల్‌”పై పూర్తిగా దృష్టి సారించాడు. మార్చిలో షూటింగ్‌ని ప్రారంభించి, ఈ ఏడాది డిసెంబర్‌లో “పుష్ప : ది రూల్‌”ని విడుదల చేయాలని సుకుమార్, బన్నీ భావించారు. కానీ “పుష్ప” మేనియా చూసిన టీం ప్లాన్ మార్చుకున్నారు. అందులో భాగంగా “పుష్ప : ది రూల్” షూటింగ్ జూలై మొదటి వారం నుండి ప్రారంభమవుతుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. అల్లు అర్జున్ కూడా “పుష్ప : ది రైజ్” కోసం మిస్ అయిన సినిమా ప్రమోషన్‌లను “పుష్ప 2” కోసం మిస్ కావొద్దని భావిస్తున్నారు. ఈ సీక్వెల్ కు తగినంత సమయాన్ని కేటాయించాలని భావిస్తున్నాడు. మరోవైపు సుకుమార్ స్క్రిప్ట్‌కి తుది మెరుగులు దిద్దుతున్నాడు దేవిరాక్ స్టార్ శ్రీ ప్రసాద్ ఇప్పటికే మూడు సాంగ్స్ ను పూర్తి చేశాడు. మేలో సుకుమార్ అండ్ టీమ్ లొకేషన్స్ ఫైనలైజ్ చేసి, షెడ్యూల్స్ ప్లాన్ చేస్తారు. “పుష్ప : ది రూల్” చిత్రంలో అల్లు అర్జున్ భార్యగా రష్మిక మందన్న నటిస్తుండగా, అనసూయ, ఫహద్ ఫాసిల్, సునీల్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాను నిర్మించనుంది.

Exit mobile version