HBD Allu Arjun : రూల్ చేయడానికి ‘పుష్ప’ రెడీ… కానీ ప్లాన్ చేంజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి సెర్బియాలో ఉన్నాడు. రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్బస్టర్లతో అల్లు అర్జున్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇటీవల “పుష్ప” హిట్ ఇచ్చిన కిక్ ను ఎంజాయ్ చేస్తున్నారు బన్నీ. ఇక “పుష్ప 2″ను తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా “పుష్ప : ది రూల్” మేకర్స్ ఒక కొత్త పోస్టర్‌ను ఆవిష్కరించారు. అల్లు అర్జున్ “పుష్ప”రాజ్ అవతార్‌లో కనిపించడంతో పోస్టర్ వెంటనే అందరి దృష్టిని ఆకర్షించింది. రూల్ చేయడానికి ‘పుష్ప’ రెడీగానే ఉన్నాడు. కానీ ప్లాన్ లో చిన్న చేంజ్
జరిగినట్టు తెలుస్తుంది.
Read Also : Mahesh Babu : గోల్డెన్ హార్ట్… 30 మంది చిన్నారుల జీవితాల్లో వెలుగు
Also Read
- SlumDog – 33 Temple Road: 'స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్' కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి... టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు'కి అనసూయ పరోక్ష కౌంటర్?
- Peddi Collections : బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
- Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్
ఇప్పుడు అల్లు అర్జున్ “పుష్ప : ది రూల్”పై పూర్తిగా దృష్టి సారించాడు. మార్చిలో షూటింగ్‌ని ప్రారంభించి, ఈ ఏడాది డిసెంబర్లో “పుష్ప : ది రూల్”ని విడుదల చేయాలని సుకుమార్, బన్నీ భావించారు. కానీ “పుష్ప” మేనియా చూసిన టీం ప్లాన్ మార్చుకున్నారు. అందులో భాగంగా “పుష్ప : ది రూల్” షూటింగ్ జూలై మొదటి వారం నుండి ప్రారంభమవుతుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. అల్లు అర్జున్ కూడా “పుష్ప : ది రైజ్” కోసం మిస్ అయిన సినిమా ప్రమోషన్లను “పుష్ప 2” కోసం మిస్ కావొద్దని భావిస్తున్నారు. ఈ సీక్వెల్ కు తగినంత సమయాన్ని కేటాయించాలని భావిస్తున్నాడు. మరోవైపు సుకుమార్ స్క్రిప్ట్‌కి తుది మెరుగులు దిద్దుతున్నాడు దేవిరాక్ స్టార్ శ్రీ ప్రసాద్ ఇప్పటికే మూడు సాంగ్స్ ను పూర్తి చేశాడు. మేలో సుకుమార్ అండ్ టీమ్ లొకేషన్స్ ఫైనలైజ్ చేసి, షెడ్యూల్స్ ప్లాన్ చేస్తారు. “పుష్ప : ది రూల్” చిత్రంలో అల్లు అర్జున్ భార్యగా రష్మిక మందన్న నటిస్తుండగా, అనసూయ, ఫహద్ ఫాసిల్, సునీల్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాను నిర్మించనుంది.
He is all set to RULE 😎
Happy Birthday Icon Star @alluarjun 💥💥💥
Team – #Pushpa#HappyBirthdayAlluArjun pic.twitter.com/jXkom59i2E
— Pushpa (@PushpaMovie) April 7, 2022
తాజావార్తలు
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
-
PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
-
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
-
US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. “నిఘా”పై పెంటగాన్ హెచ్చరిక..
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!