Site icon NTV Telugu

Allu Arjun: బ్యాక్ టు బ్యాక్ 3 అవార్డ్స్.. అల్లు అర్జున్ ఆసక్తికరమైన ట్వీట్

Aluu Arjun

Aluu Arjun

సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు వినగానే స్టైల్, ఎనర్జీ, మాస్ అప్పీల్ గుర్తుకు వస్తాయి. గతంలో పుష్ప: ది రైజ్ తో నేషనల్ స్థాయిలో దుమ్ము రేపిన బన్నీ, ఇప్పుడు పుష్ప 2: ది రూల్ తో అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డ్స్ 2025 (South Indian International Movie Awards)లో పుష్ప 2 ఘన విజయం సాధించింది. మొత్తం 11 నామినేషన్లలో 5 విభాగాల్లో అవార్డులు అందుకోవడం ద్వారా మరోసారి ఈ మూవీ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో రుజువైంది. అందులో ముఖ్యంగా బెస్ట్ యాక్టర్ అవార్డుని అల్లు అర్జున్ గెలుచుకోవడం అభిమానులకు గర్వకారణంగా మారింది.

Also Read : Samantha: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత అవేర్ నెస్ వీడియో..

కాగా ఈ విజయం పై అల్లు అర్జున్ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.. “ఈ అవార్డులన్నీ నా టీమ్ కృషి వల్లే సాధ్యమయ్యాయి. సుకుమార్ గారు, మొత్తం పుష్ప ఫ్యామిలీకి నా కృతజ్ఞతలు. ముఖ్యంగా నాకు నిరంతరం అండగా నిలిచే నా అభిమానులకి ఈ అవార్డులను అంకితం చేస్తున్నాను” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ఇక వరుసగా మూడు సైమా బెస్ట్ యాక్టర్ అవార్డులను గెలుచుకోవడం బన్నీ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. గతంలో అల వైకుంఠపురములో, పుష్ప: ది రైజ్ కు అవార్డు గెలిచిన బన్నీ, ఇప్పుడు పుష్ప 2: ది రూల్ తో హ్యాట్రిక్ కొట్టేశారు. దీంతో బన్నీ పోస్ట్ చూసిన అభిమానులు సోషల్ మీడియాలో ఫుల్ జోష్‌లో రిప్లైలు ఇస్తున్నారు. “ఐకాన్ స్టార్ కి ఇది సరిపోదు, ఇంకా ఎన్నో అవార్డులు రావాలి”, “నువ్వు గెలిచేది అవార్డులు కాదు, మన హృదయాలు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Exit mobile version