Nikhil: కార్తికేయ 2 తో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు కుర్ర హీరో నిఖిల్. ఇక నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజీస్. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాస్ నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా డిసెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికీ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ కు దగ్గరవుతుండగా ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్.. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు.
డిసెంబర్ 19 న జరిగే ఈ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా రానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. చిన్న హీరోలకు సపోర్ట్ ఇవ్వడంలో బన్నీ ఎప్పుడు ముందుంటాడు. అందులోనూ ఈ సినిమాకు బన్నీ బెస్ట్ ఫ్రెండ్ బన్నీ వాస్ నిర్మాత కావడంతో అల్లు అర్జున్ ఈ ఈవెంట్ కు రావడానికి అంగీకరించాడు అని చెప్పొచ్చు. మరి ఈ ఈవెంట్ లో బన్నీ ఎలాంటి స్పీచ్ ఇస్తాడో అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
𝐈𝐂𝐎𝐍 𝐒𝐓𝐀𝐑 @alluarjun garu to grace the grand pre-release event of #18Pages on 𝐃𝐄𝐂 𝟏𝟗th !#AAFor18Pages ~ #LoveIsCrazy #18Pages @aryasukku @actor_Nikhil @anupamahere @idineshtej @dirsuryapratap #BunnyVas @GopiSundarOffl @NavinNooli @adityamusic @shreyasgroup pic.twitter.com/xEA8eowmAU
— Vamsi Kaka (@vamsikaka) December 16, 2022