మెగా హీరో సాయిధరమ్ తేజ్ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. కాగా, నేడు సాయితేజ్‌ని అల్లు అర్జున్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సాయితేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాయితేజ్‌కి యాక్సిడెంట్ జరిగినప్పుడు బన్నీ కాకినాడలోని ‘పుష్ప’ షూటింగ్‌లో ఉన్నారు. ఎప్పటికప్పుడు సాయితేజ్ ఆరోగ్యాన్ని తెలుసుకున్న బన్నీ.. హైదరాబాద్ వచ్చిన వెంటనే పరామర్శించారు.
ఈ నెల 10న తన స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణిస్తున్న సాయిధరమ్‌తేజ్ ప్రమాదవశాత్తూ కిందపడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రగాయాలవగా, ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన్ను అపోలో ఆసుపత్రికి తరలించారు. కాలర్ బోన్ సర్జరీ విజయవంతంగా పూర్తిచేశామని, ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని క్రమంగా కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు.
