Allu Arjun: న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా హాయ్ నాన్న. వైరా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి నుంచి పాజిటివ్ టాక్ అందుకొని కలక్షన్స్ రాబట్టి.. మంచి హిట్ అందుకుంది. దసరా తరువాత నాని ఖాతాలో మరో హిట్ పడింది. రికార్డ్ కలక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమాపై సెలబ్రిటీలు సైతం రివ్యూలు ఇచ్చి ఇంకా హైప్ పెంచుతున్నారు. ఇక మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ తీరే ప్రత్యేకం. సినిమా నచ్చితే చాలు.. అది చిన్నదా.. పెద్దదా.. మనదా.. పక్క భాషలదా అనేది చూడడు. తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పుకొస్తాడు. తాజాగా బన్నీ, హాయ్ నాన్న సినిమా చూసి.. తనదైన రివ్యూ చెప్పుకొచ్చాడు. కేవలం బావుంది అని మాత్రమే చెప్పకుండా అందులో నటించిన ప్రతి ఒక్కరి గురించి క్షుణ్ణంగా రాసుకొచ్చాడు.
“హాయ్ నాన్న మొత్తం టీమ్‌కి అభినందనలు. హృదయానికి హత్తుకొనే మంచి సినిమా.. బ్రదర్ నాని.. నీ నటన సూపర్.. అటువంటి ఆకర్షణీయమైన స్క్రిప్ట్‌ను గ్రీన్ లైటింగ్ చేసి వెలుగులోకి తెచ్చినందుకు నేను ఎంతో గౌరవంగా ఫీల్ అవుతున్నాను. మృణాల్.. మీ స్వీట్ నెస్ తెరపై కనిపిస్తుంది.. మీలాగే ఎంతో అందంగా ఉంది. బేబీ కియారా.. మై డార్లింగ్.. నీ క్యూట్‌నెస్‌తో హృదయాలను ద్రవింపజేస్తున్నావు.. ఇక చాలు.. స్కూల్ కు వెళ్లు. ఇతర ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్‌లు, కెమెరామెన్‌కు కూడా అభినందనలు. దర్శకుడు శౌర్యవ్.. మీరు మీ తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నారు. మీరు చాలా హృదయాలను హత్తుకునే & కన్నీరు తెప్పించే క్షణాలను సృష్టించారు. అద్భుతమైన ప్రెజెంటేషన్.. ఇలాగే సినిమాలు చేస్తూ ఉండండి. ఇలాంటి మధురమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన నిర్మాతలకు అభినందనలు” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్ కు నాని ఫిదా అయిపోయాడు. ఆయన ట్వీట్ చేస్తూ.. ” అర్హ వాళ్ల నాన్న కూడా ఆమోదించాడు. థాంక్యూ బన్నీ.. మంచి సినిమా గురించి చెప్పడానికి నువ్వెప్పుడూ ముందు ఉంటావ్” అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
Arha’s Nanna approves 🙂
Thank you so much dear bunny. You always been there for good cinema ♥️#HiNanna https://t.co/ipdJQcX33p— Hi Nani (@NameisNani) December 11, 2023
