Site icon NTV Telugu

ఫ్యామిలీతో ‘పుష్ప’రాజ్ సందడి @ ఆర్టీసీ క్రాస్ రోడ్స్

Pushpa

ఫ్యామిలీతో ‘పుష్ప’రాజ్ సందడి @ ఆర్టీసీ క్రాస్ రోడ్స్”పుష్ప ది రైజ్” చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ పాజిటివ్ బజ్ నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపుగా మూడు వేలకు పైగా థియేటర్లలో విడుదలైంది. అయితే అల్లు అర్జున్ మలయాళ ఫ్యాన్స్ కు మాత్రం నిరాశ తప్పలేదు. అక్కడ తమిళ వెర్షన్ లో అయితే రిలీజ్ చేశారు. కానీ మలయాళ వెర్షన్ ను సాంకేతిక సమస్య కారణంగా రేపు విడుదల చేయబోతున్నారు. ఇక ఆంధ్రాలోనూ చాలాచోట్ల బెనిఫిట్ షోలు పడలేదు. ఏపీ ప్రభుత్వం ఈ సినిమాకు కూడా బెనిఫిట్ షోలకు అనుమతించలేదు. అన్నిచోట్లా సినిమాకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లోనూ 95-100% టికెట్స్ అమ్ముడైపోయాయని సమాచారం. ఇదిలా ఉండగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈరోజు ‘పుష్ప’రాజ్ సందడి చేయబోతున్నాడు.

Read Also : బన్నీ మలయాళ ఫ్యాన్స్ కు షాక్… చివరి నిమిషంలో ట్విస్ట్ !

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మొదటి పాన్ ఇండియా సినిమా “పుష్ప ది రైజ్”ను ఫ్యామిలీతో కలిసి వీక్షించబోతున్నారు. ఈ మేరకు బన్నీ ఫ్యామిలీ మొత్తం ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్లో సినిమాను చూడబోతున్నారని సమాచారం. ఈ విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియా మేనేజర్ శరత్ చంద్ర వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అక్కడికి పోటెత్తడం ఖాయం. ఇక ‘పుష్ప’ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోందో చూడాలి.

Exit mobile version