స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా రేంజ్ కి వెళ్లిన అల్లు అర్జున్ కెరీర్ లో ది బెస్ట్ సినిమా అనగానే అందరికీ ‘జులాయి’ గుర్తొస్తుంది. త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ పెన్ను పదును ఏంటో జులాయి సినిమాలో కనిపిస్తుంది. ది బెస్ట్ హీరో అండ్ విలన్ ట్రాక్ ని ఇచ్చిన ఈ హీరో డైరెక్టర్ కాంబినేషన్, ఇప్పటివరకూ మూడు సినిమాలు చేసి మూడు సార్లూ హిట్ కొట్టారు. ముఖ్యంగా ఈ కాంబినేషన్ లో వచ్చిన లాస్ట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. అల్లు అర్జున్ ని ఫ్రెష్ గా చూపించడంలో, అల్లు అర్జున్ కామెడి టైమింగ్ ని పర్ఫెక్ట్ గా వాడుకోవడంలో త్రివిక్రమ్ దిట్ట. అందుకే ఈ కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చినా ఫాన్స్ ని డిజప్పాయింట్ చేయవు. ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమా మొదలు పెట్టే ప్రాసెస్ లో ఉన్న అల్లు అర్జున్, ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగానే మరోసారి మాటల మాంత్రికుడితో కలవడానికి రెడీ అవుతున్నాడు.
అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో నాలుగో సినిమాకి గ్రౌండ్ ప్రిపేర్ అవుతుందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. మహేశ్ తో త్రివిక్రమ్ చేస్తున్న #ssmb28 సినిమా షూటింగ్ ఇటివలే మొదలయ్యింది. ఈ సినిమా షూటింగ్ మార్చ్ లోపు మిగించి సమ్మర్ బరిలో నిలబెట్టేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మహేశ్ బాబుతో సినిమా పూర్తవ్వగానే అల్లు అర్జున్ సినిమాని మొదలుపెట్టనున్నాడట త్రివిక్రమ్. పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్, తన మార్కెట్ ని ఇంకా పెంచుకోవాలి అంటే ‘పుష్ప’ రేంజ్ ని కంటిన్యూ చేయాల్సి ఉంది. అది జరగాలి అంటే రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకుల వల్లనే అవుతుంది. రాజమౌళికి ఉన్న కమిట్మెంట్స్ నేపధ్యంలో అల్లు అర్జున్ జక్కనల సినిమా ఇప్పట్లో అనౌన్స్ అయ్యే ఛాన్స్ లేదు. ప్రశాంత్ నీల్ కి కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక తమిళ దర్శకులని నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు ఎప్పుడు హిట్ కొడతారో, ఎప్పుడు ఫ్లాప్ ఇస్తారో వాళ్లకే తెలియదు. ఇలాంటి సమయంలో… అల్లు అర్జున్ కి ఉన్న ఏకైక ఆప్షన్ తెలుగు దర్శకులని నమ్మడమే. టాలివుడ్ నుంచి మోస్ట్ ప్రామిసింగ్ డైరెక్టర్స్ అంటే అందులో త్రివిక్రమ్ తప్పకుండా ఉంటాడు. ఈ విషయం తెలిసిన వాడు, ఇప్పటికే మూడు సినిమాలు చేసిన వాడు కాబట్టే… బన్నీ త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడు. మరి ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఈ కాంబినేషన్ లో సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో? ఈసారి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.