NTV Telugu Site icon

Allu Arjun: పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ థాంక్స్

Pawan Kalyan Allu Arjun

Pawan Kalyan Allu Arjun

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ థాంక్స్ చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక సుదీర్ఘమైన మెసేజ్ షేర్ చేశారు. అసలు విషయం ఏమిటంటే అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించాలని రెండు తెలుగు రాష్ట్రా ప్రభుత్వాలను నిర్మాతల కోరారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేయగా తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా భారీగా రేట్లు పెంచుకునే సౌలభ్యం కల్పిస్తూ జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.

Rajamouli: సుక్కూ హార్ట్ ఎటాక్ తెచ్చుకోకు.. జక్కన్న ఝలక్ !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా థాంక్స్ చెబుతున్నానని, టికెట్ రేట్లు పెంచుకొని తమ సినిమాకి మరింత బూస్ట్ ఇస్తుంది అని చెప్పుకొచ్చారు. తెలుగు సినీ పరిశ్రమ ఎదుగుదలకు మీరు ఎంత కమిటయి ఉన్నారో ఈ ఒక్క నిర్ణయంతో అర్థమవుతుందని అని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా స్పెషల్ అలాగే సిన్సియర్ థాంక్స్ చెబుతున్నానని ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక వారిద్దరి మంచి మనసు ఉందని అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. ఇక మరో పక్క పవన్ కళ్యాణ్ సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత తాను హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో జాయిన్ అవుతున్నట్టుగా ఈరోజు సాయంత్రమే సోషల్ మీడియా వేదికగా స్పందించడం గమనార్హం.