‘పుష్ప’ ‘భరతుడ్ని’ కలిశాడు! ఎక్కడా అంటారా? ‘శాకుంతలం’ సెట్స్ మీద! అల్లు అర్జున్, అల్లు అర్హా ఒకే లొకేషన్ లో తమ తమ సినిమాల కోసం షూట్ చేస్తుండటంతో బన్నీ కూతురు వద్దకి తరలి వచ్చాడు. అల్లు వారసురాలు ‘భరతుడి’ గెటప్ లో కెమెరా ముందు నటిస్తుంటే స్వయంగా ఐకాన్ స్టార్ చూసి మురిసిపోయాడు!
‘శాకుంతలం’ మూవీలో సమంత టైటిల్ రోల్ పోషిస్తోంది. అర్హా రాజకుమారుడు భరతుడుగా అలరించనుంది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న పౌరాణికం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
‘పుష్ప’ మీట్స్ ‘భరత’… అర్హా ను ‘ఆహా’ అంటోన్న అర్జున్!
