NTV Telugu Site icon

Allu Arjun: పుష్ప 2 కోసం బన్నీ తీసుకున్న రెమ్యూనిరేషన్.. దేవుడా అన్ని కోట్లా.. ?

Bunny

Bunny

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బన్నీ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే పుష్ప అనే చెప్పాలి. రెండేళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ ఏడాది నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. దీంతో ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ గురించే మాట్లాడుకుంటున్నారు. 68 ఏళ్ల తర్వాత నేషనల్ అవార్డు అందుకున్న ఏకైక హీరోగా అల్లు అర్జున్ ను ప్రశంసిస్తున్నారు. ఇక ఈ అవార్డు రావడంతో బన్నీ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. పార్టీ అడిగిన వారందరికీ పార్టీ ఇస్తూనే ఉన్నాడు. ఇప్పటికే మీడియా వారికి పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే ఇండస్ట్రీలోని ప్రముఖులకు, పుష్ప చిత్ర బృందానికి స్పెషల్ గా బన్నీ పార్టీ ఇవ్వనున్నాడట. ఈ విషయం పక్కన పెడితే గత రెండు రోజుల నుంచి పుష్ప 2కు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది.

Punch Prasad: సర్జరీ తరువాత మొదటిసారి.. అతడి గురించి చెప్తూ ఎమోషనల్ అయిన జబర్దస్త్ కమెడియన్

అదేంటంటే టాలీవుడ్ లో టాప్ రెమ్యూనిరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరో అల్లు అర్జున్ అని టాక్ నడుస్తుంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. నిజం చెప్పాలంటే బన్నీకి సౌత్ ఆడియన్స్ తో పోలిస్తే నార్త్ ఆడియన్స్ చాలా ఎక్కువ అని చెప్పాలి. కేరళ, ముంబై ఇలా బన్నీని అమితంగా ప్రేమించే అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం పుష్ప 2 కోసం సౌత్ఆడియన్స్ కన్నా నార్త్ ఆడియన్సే ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే పుష్ప 2 ను హిందీలో రిలీజ్ చేసే రైట్స్ ను బన్నీ సొంతం చేసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీ స్టార్ డమ్ ను బట్టి ఇప్పుడు పుష్ప 2 విలువ రూ.125 కోట్లు అని తెలుస్తుంది. దీంతో పుష్ప 2 కు రెమ్యూనిరేషన్ గా డబ్బులు తీసుకోకుండా హిందీ రైట్స్ ను సొంతం చేసుకున్నాడట అల్లు అర్జున్. ఆ లెక్కన చూస్తే ఒక్క సినిమాకు బన్నీ రూ. 125 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది. దీంతో టాలీవుడ్ లోనే టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా బన్నీ చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే ప్రభాస్ రూ.100 కోట్లు తీసుకుంటున్నాడని.. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ రూ.70కోట్లు నుంచి 80 కోట్లు వరకు తీసుకుంటున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.. ఇప్పుడు వీరందరినీ దాటుకొని ఒక్కసారిగా బన్నీ టాప్ రెమ్యూనిరేషన్ అందుకోవడం అభిమానుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుందని అంటున్నారు. దీంతో అల్లు ఫాన్స్ కాలర్ ఎగరేసి బన్నీ ఈజ్ ది కింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో ఎంత నిజం అనేది తెలియాల్సి ఉంది.