NTV Telugu Site icon

Allu Arjun: పుష్ప 2 కోసం అన్ని కోట్ల ఆఫర్.. అయినా కాదనుకున్న అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా?

Pushpa 2

Pushpa 2

Allu Arjun rejected brands for Pushpa The Rule on Screen: పుష్ప 2 కోసం కొన్ని కోట్లు రూపాయల ఆదాయాన్ని అల్లు అర్జున్ వద్దనుకున్నారని సోషల్ మీడియాలో వైరల్ అయింది. అల్లు అర్జున్ పుష్ప ది రూల్ కోసం పలు బ్రాండ్‌లను తిరస్కరించారని అంటున్నారు. “పుష్ప: ది రైజ్” సీక్వెల్ “పుష్ప: ది రూల్” సినిమా కోసం అల్లు అర్జున్ పొగాకు, పాన్ అలాగే మద్యం బ్రాండ్‌లను ప్రమోట్ చేసేందుకు దూరంగా ఉన్నడనై అంటున్నారు. “పుష్ప: ది రూల్” సినిమా కోసం ప్రముఖ మద్యం – పాన్ బ్రాండ్స్ అందించే లాభదాయకమైన బ్రాండ్ ప్లేస్‌మెంట్స్ డీల్‌ను సైతం ఆయన తిరస్కరించినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం, అల్లు అర్జున్ స్క్రీన్ లో మద్యపానం, ధూమపానం లేదా గుట్కా నమలడం వంటి వి చేస్తున్నప్పుడు వారి లోగోను ప్రదర్శించడం కోసం బ్రాండ్స్ సుమారు ₹10 కోట్లను ప్రతిపాదించాయట. అయితే అల్లు అర్జున్ అటువంటి బ్రాండ్‌లను ప్రచారం చేయడంలో అసౌకర్యాన్ని వ్యక్తం చేస్తూ ఆఫర్‌ను తిరస్కరించారని అంటున్నారు.

Harish Rao: ఇంకా రేవంత్ సీఎం అయినట్టు భావించడం లేదు

ఆలా చేస్తే కనుక నిజ జీవితంలో ధూమపానం లేదా మద్యపానం చేయమని అభిమానులను ప్రోత్సహించినట్టు ఉంటుందని అందుకే అలా చేయకూడదని నిర్ణయం తీసుకున్నాడు అని తెలుస్తోంది. అల్లు అర్జున్’ గతంలో కూడా పొగాకు ప్రొడక్ట్ ను ప్రమోట్ చేయమంటే ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు “పుష్ప: ది రైజ్” విజయం తర్వాత టీవీ వాణిజ్య ప్రకటన కోసం పొగాకు కంపెనీ సంప్రదించగా ఆయన టీం అభిమానులను అల్లు అర్జున్ ప్రభావితం చేయాలనుకోవడం లేదని స్పష్టం చేసింది. సుకుమార్ దర్శకత్వం వహించిన “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 2021లో పలు భాషల్లో విడుదలైంది, ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి సానుకూల స్పందనలను పొందింది. ఎర్రచందనం స్మగ్లర్‌గా ఎదిగి, భయంకరమైన సవాళ్లను ఎదుర్కొంటూ, వచ్చిన పుష్ప అనే దినసరి కూలీ ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపారు. ఇక ఆగష్టు 2024లో సెకండ్ పార్ట్ రిలీజ్ చేయనున్నారు.