ఐకాన్ స్టార్ అల్లు అర్జన్ ‘పుష్ప’రాజ్ ఊర మాస్ అవతార్ లో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి ఈరోజు థియేటర్లలోకి రాగా, మరోవైపు తగ్గేదే లే అంటూ “స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్” బాక్సాఫీస్ క్లాష్ కు సిద్ధమయ్యాడు. రెండు సినిమాలకూ ఇక్కడ భారీ క్రేజ్ ఉంది.
Read Also : ఫ్యామిలీతో ‘పుష్ప’రాజ్ సందడి @ ఆర్టీసీ క్రాస్ రోడ్స్
అయితే ఈ క్లాష్ గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ “స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్’ విడుదలవ్వడం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. ‘స్పైడర్ మ్యాన్’కు ఇక్కడ చాలా క్రేజ్ ఉంది. మరి ‘పుష్ప’ బాక్సాఫీస్ వద్ద ఎంత వసూళ్లు సాధిస్తుందో ఆలోచించడం లేదు. కానీ ఈ సినిమా ఎంత వసూళ్లు రాబడుతుందోనని ఆలోచిస్తున్నాను. మనం ఇప్పుడే మహమ్మారి నుండి బయటపడ్డాము. ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే థియేటర్‌లకు తిరిగి వస్తున్నారు.
Read Also : ‘పుష్ప’ సెకండ్ పార్ట్ టైటిల్ లీక్..!!
చాలా కాలంగా థియేటర్లు మూతపడ్డాయన్న విషయం తెలిసిందే. ఇప్పుడు జనాలు మళ్లీ వస్తున్నారు, కాబట్టి అన్ని సినిమాలు చాలా డబ్బు సంపాదించాలి. ‘స్పైడర్ మ్యాన్’ బోలెడంత డబ్బు సంపాదించాలి… అలాగే ‘పుష్ప’ కూడా… అంతేకాదు ఆ తర్వాత వచ్చే సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాలి…. అది బాలీవుడ్, హాలీవుడ్ ఏదైనా… నేను వారిని స్వాగతిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ‘పుష్ప’ థియేట్రికల్, ఓటిటి, శాటిలైట్, ఆడియో హక్కులతో సహా ఓవరాల్ రైట్స్ ధర రూ. 250 కోట్లు పలికినట్లు తెలుస్తోంది. అది బాహుబలి స్థాయి అని చెప్పొచ్చు.
