NTV Telugu Site icon

Allu Arjun: ఆర్ఆర్ఆర్ పై బన్నీ ప్రశంసల వర్షం.. అందరి చూపు ఆ ఒక్క మాటమీదే

Allu Arjun

Allu Arjun

Allu Arjun: ఆర్ఆర్ఆర్.. ఆస్కార్ అందుకొని ఇండియా గురించే ప్రపంచం మొత్తం మాట్లాడుకొనేలా చేసింది. నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అందుకున్న విషయం తెల్సిందే. ఇకఅవార్డు రావడం ఆలస్యం.. ఇండియా మొత్తం ఒకటే మాట.. ఆర్ఆర్ఆర్. రాజమౌళి ని ప్రతి ఒక్కరు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోలు, సినీ, రాజకీయ ప్రముఖులు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం అవార్డు వచ్చాకా ఒక ట్వీట్ తో కూడా వారికి శుభాకంక్షలు తెలపలేదు అని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆయన పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉండడంతో ట్వీట్ చేయడం కొంచెం లేట్ అయిందని తెలుస్తోంది. శుభాకాంక్షలు కొంచెం లేట్అయినా లేటెస్ట్ గా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందంలో ఒక్కరిని కూడా మర్చిపోకుండా శుభాకాంక్షలు చెప్పుకొచ్చాడు బన్నీ.

Prabhas:హెల్త్ చెకప్ కోసం విదేశాలకు ప్రభాస్..?

“భారతదేశానికి అతిపెద్ద క్షణం.. ఆస్కార్ లో తెలుగుపాట షేక్ చేసినందుకు ఉప్పొంగిపోతున్నాం. కీరవాణి గారు, చంద్ర బోస్ గారు, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, రాహుల్, కాళభైరవ మీకు నా అభినందనలు. ప్రపంచాన్ని మీ స్టెప్స్ తో మైమరిచిపోయేలా చేసిన గ్లోబల్ స్టార్, నా ప్రియమైన సోదరుడు రామ్ చరణ్, మరియు ఇండియా ప్రైడ్ ఎన్టీఆర్ మీకు అభినందనలు. ఇక ఈ అద్భుతం వెనుక ఉన్న మనిషి ఎస్ఎస్ రాజమౌళికి అభినందనలు. ఆర్ఆర్ఆర్.. భారతదేశం మొత్తం హృదయానికి హత్తుకునేలా చేసిన ఇండియన్ సినిమా” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ట్వీట్ మొత్తం లో బన్నీ, ఎన్టీఆర్ ను ఇండియా ప్రైడ్ అనడం చాలా అంటే చాలా స్పెషల్ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఎన్టీఆర్.. భారతదేశం గర్వించదగ్గ నటుడు అని జక్కన్న ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అదే విషయాన్నీ బన్నీ సైతం అంగీకరించి.. మన ఇండియా గర్వం అని రాసుకురావడం అద్భుతమని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Show comments