Site icon NTV Telugu

Allu Arjun: కెజిఎఫ్ 2 .. బన్నీ రివ్యూ ఇదే

Bunny

Bunny

కన్నడ స్టార్ హీరో యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన కెజిఎఫ్ 2 ఏప్రిల్ 14 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న విషయం విదితమే. పాన్ ఇండియా మూవీగా విడుదలై రికార్డు కలెక్షన్స్ రాబట్టి చరిత్ర సృష్టిస్తోంది. ఇక ప్రశాంత్ నీల్, రాకింగ్ పర్ఫార్మెన్స్ పరంగా హీరో యష్‌లపై సౌత్ – నార్త్ సినీ ఇండస్ట్రీలలోని ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెజిఎఫ్ 2 చిత్రాన్ని వీక్షించి.. తనదైన శైలిలో చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించాడు.

“కెజిఎఫ్ 2 చిత్ర బృందానికి అభినందనలు. యష్ పర్ఫార్మెన్స్ అద్భుతం.. సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టిలు అయస్కాంత నటనతో ఆకట్టుకున్నారు. భువన్ గౌడ, రవి బస్సూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అద్భుతమైన విజువల్స్ అందించారు. ఇతర టెక్నీషియన్స్ అందరి పనితీరును నేను గౌరవిస్తున్నాను. ప్రశాంత్ నీల్ గారు అద్భుతమైన ప్రదర్శన అందించారు. ఆయన దృక్పథానికి, విశ్వాసానికి నేను గౌరవమిస్తున్నాను. ఈ సినిమాతో సినిమాటిక్ అనుభూతిని అందించినందుకు మరియు భారతీయ సినిమా పతాకాన్ని ఎగురవేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version