పిల్లలను ఆటలాడిస్తూ, తల్లిదండ్రులు సైతం పిల్లలుగా మారిపోతుంటారు! బయటి వాళ్ళకు స్టార్స్ కావచ్చు కానీ పిల్లలకు మాత్రం అమ్మానాన్న అంతే!! అలానే ఆ స్టార్స్ సైతం పిల్లల పెంపకం విషయంలో ఎలాంటి భేషజాలకూ పోకుండా… వారితో డౌన్ టు ఎర్త్ అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. స్టార్ కపుల్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి అందుకు మినహాయింపు కాదు. మరీ ముఖ్యంగా బన్నీ తన కూతురు అర్హాను పేంపర్ చేసే విధానం చూస్తుంటే… మనం తెర మీద చూసే ఫెరోషియస్ ఐకాన్ స్టార్ ఇతనేనా అనిపిస్తుంది. నిన్నటి వరకూ పక్కపక్కనే ఇటు ‘పుష్ప’, అటు ‘శాకుంతలం’ సినిమాల షూటింగ్స్ జరిగాయి. దాంతో బన్నీ సమయం చిక్కినప్పుడల్లా కూతురు నటిస్తున్న ‘శాకుంతలం’ షూటింగ్ స్పాట్ కు వెళ్ళి ఆ చిన్నారితో గడిపి వస్తుండేవాడు. అయితే సోమవారం రాత్రితో ‘శాకుంతలం’లో అర్హా నటిస్తున్న భరతుడి పార్ట్ చిత్రీకరణ పూర్తయిపోయింది. సో… ఆ ఆటపాటలు ఇప్పుడు వీరిద్దరూ ఇప్పుడు ఇంట్లో కొనసాగిస్తున్నారు. బన్నీ వాటర్ బెలూన్స్ ను వదులుతుంటే వాటిని కొట్టే ప్రయత్నం అర్హా చేస్తోంది. ఈ ఆటలను స్నేహారెడ్డి తన సెల్ లో బంధించి, ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇంకేముంది… బన్నీ ఫాన్స్ ఈ స్మాల్ వీడియోకు లైక్స్ కొడుతూ, సోషల్ మీడియాలో వైరల్ చేసే పనిలో పడ్డారు.
నిన్న సెట్ లో… నేడు ఇంట్లో పుష్ప, భరతుని ఆటపాటలు!
