Site icon NTV Telugu

Allu Arjun : సో ప్రౌడ్ ఆఫ్ యూ మై బేబీ… లిటిల్ గ్రాడ్యుయేట్

Allu-Arha

‘పుష్ప’ స్టార్ అల్లు అర్జున్ తాజాగా తన కూతురు గురించి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు. సాధారణంగా ఒకవైపు సినిమాలు చేస్తూనే కుటుంబానికి కూడా కావాల్సినంత సమయాన్ని కేటాయింస్తుంటాడు బన్నీ. అప్పుడప్పుడూ ఆయన ఫ్యామిలీ వెకేషన్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే అందుకు నిదర్శనం. తాజాగా ఓ మనోహరమైన పిక్ ను షేర్ చేస్తూ “నా లిల్ గ్రాడ్యుయేట్‌కు అభినందనలు #అల్లు అర్హ మీ గురించి గర్వపడుతున్నాను మై బేబీ” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ వర్డ్స్ రాసుకొచ్చారు. అల్లు అర్హ ఇప్పుడు లిటిల్ గ్రాడ్యుయేట్… అంటే నెక్స్ట్ క్లాస్ కు ప్రొమోషన్ పొందిందన్నమాట.

Read Also : HBD Ram Charan : ఎన్టీఆర్ ఇంట్లో బర్త్ డే సెలబ్రేషన్స్… పిక్ వైరల్

ఇక ఇప్పటికే టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న అల్లు అర్హ “శాకుంతలం” సినిమాతో వెండితెర అరంగ్రేటం కూడా చేస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పౌరాణిక చిత్రంలో అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనుంది. ఇక ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప : ది రైజ్” రెండవ భాగం షూటింగ్ త్వరలో ప్రారంభించనున్నారు. ఈ సీక్వెల్ కూడా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కనుంది. ఆ తరువాత కొరటాల శివ, సంజయ్ లీలా భన్సాలీ, రాజమౌళి వంటి దిగ్గజ దర్శకులతో అల్లు అర్జున్ సినిమాలు చేయబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

Exit mobile version