NTV Telugu Site icon

Thandel : నేడు తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్

Thandel (2)

Thandel (2)

ఈసారి అక్కినేని ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా తండేల్ సినిమా ఉంటుందని గట్టిగా నమ్ముతున్నారు అభిమానులు. అందుకు తగ్గట్టే సెన్సార్ టాక్ కూడా అదిరిపోయింది. చైతన్య కెరీర్లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందని అంటున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా   ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడప్ చేసిన మేకర్స్ రీసెంట్‌గా వైజాగ్‌లో తండేల్ ట్రైలర్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ అదిరిపోయింది. పాన్ ఇండియా సినిమా కావడంతో తమిళ నాడులోను ఈవెంట్ నిర్వహించారు.

Also Read : Akanksha Sharma : కుర్రకారు మదిలో కాంక్ష రేపుతున్న లైలా బ్యూటీ ‘ఆకాంక్ష శర్మ’ ..

త‌మిళ ట్రైల‌ర్‌ను కోలీవుడ్ స్టార్ హీరో కార్తి రిలీజ్ చేశారు. ముంబైలో కూడా తండేల్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు. ముంబై ఈవెంట్‌కు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ గెస్ట్‌గా హాజ‌రుకానున్నారు. ఇక ఇప్పుడు తండేల్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రంగం సిద్ధం చేస్తున్నారు మేకర్స్. నేడు హైద‌రాబాద్‌లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. ఈ ఈవెంట్‌కు గెస్ట్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరుకానున్నాడు. అలాగే సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా ఈ వేడుకకు ముఖ్య అతిధిగా రానున్నాడు. బన్నీహోమ్ బ్యానర్ గీతా ఆర్ట్స్ నిర్మించిన సినిమా కావడంతో తండేల్ ఈవెంట్‌ గెస్ట్‌గా వస్తున్నాడు.  సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న త‌ర్వాత అల్లు అర్జున్ అటెండ్ కానున్న ఫ‌స్ట్ సినిమా ఈవెంట్ ఇదే . అలాగే బన్నీ రాకతో తండేల్ హైప్ పాన్ ఇండియా లెవల్లో నెక్స్ట్ లెవల్‌కి వెళ్లనుంది. ఇక తండేల్ మూవీకి దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ అందించగా సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా నటించింది.