గుణశేఖర్ ‘శాకుంతలం’ మూవీ సెట్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాలుమోపాడు. టీమ్ మెంబర్స్ ని సర్ ప్రైజ్ చేసిన ఆయన కూతురి డెబ్యూ సినిమా సంగతులు అడిగి తెలుసుకున్నాడు. బన్నీకి గుణశేఖర్ తో సహా ‘శాకుంతలం’ చిత్ర బృందం అంతా ఘన స్వాగతం పలికింది. ఇక సమంత శకుంతలగా నటిస్తోన్న తాజా పౌరాణికంలో బేబీ అల్లు అర్హ కూడా కనిపించబోతోన్న సంగతి తెలిసిందే కదా! సినిమాలో అర్హ చిన్నారి భరతుడుగా అలరించనుంది…
‘శాకుంతలం’ షూటింగ్ లో కాస్సేపు గడిపిన అల్లు అర్జున్ దర్శకనిర్మాతలతో చిత్రీకరణ కొనసాగుతోన్న విధానం అడిగి తెలుసుకున్నాడు. ఇక అల్లు వారి నాలుగో తరం వారసురాలు అర్హకి డెబ్యూ మూవీ అయిన ‘శాకుంతలం’లో సమంతతో పాటూ దేవ్ మోహన్ కూడా నటిస్తున్నాడు. గుణశేఖర్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి దిల్ రాజు మరో నిర్మాత.
