Site icon NTV Telugu

Allu Arjun: ప్రభాస్, మహేష్ బాబు.. ఇప్పుడు అల్లు అర్జున్ వంతు

Bunny

Bunny

Allu Arjun: ఐకాన్ స్టార్ అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయనున్నాడు. ఇక ఈ ఏడాది పుష్ప సినిమాతో నేషనల్ అవార్డును అందుకున్నాడు. ఇక నేషనల్ అవార్డు అందుకున్న తరువాత బన్నీ రేంజ్ పూర్తిగా మారిపోయింది. తాజాగా బన్నీ మైనపు విగ్రహం మేడమ్ టుస్సాడ్స్ లో సిద్ధమవుతోంది. ఇప్పటివరకు తెలుగు నుంచి ప్రభాస్, మహేష్ బాబు మాత్రమే ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఇక ఈ లిస్ట్ లో అల్లు అర్జున్ కూడా చేరాడు. తాజాగా అల్లు అర్జున్ దుబాయ్ కు వెళ్ళాడు. మైనపు విగ్రహానికి కావాల్సిన కొలతలను ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను మేడమ్ టుస్సాడ్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.

Gopichand 32: వెంకీ లాంటి కామెడీతో వస్తే.. బ్రేక్ ఇవ్వడానికి రెడీ గా ఉన్నాం

“జాతీయ అవార్డు విజేత.. 69 సంవత్సరాలలో ఈ అవార్డును గెలుచుకున్న మొదటి తెలుగు నటుడు మరియు డ్యాన్స్ మూవ్‌లలో ఏకైక హీరో అల్లు అర్జున్, ఈ ఏడాది చివర్లో మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్‌లో తన మైనపు జంటతో ముఖాముఖికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మునుపెన్నడూ లేని విధంగా ఈవెంట్ కోసం వేచి ఉండండి” అంటూ రాసుకొచ్చారు. ఇక వీడియోలో అల్లు అర్జున్ బ్లాక్ అండ్ బ్లాక్ సూట్ లో మెరిసిపోయాడు. “నా మైనపు విగ్రహాన్ని నేను మేడమ్ టుస్సాడ్స్ లో చూడడానికి రెడీగా ఉన్నాను” అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. త్వరలోనే పుష్ప రాజ్ మైనపు విగ్రహం దుబాయ్ లో ఎంతోమంది సెలబ్రటీల మధ్య ఉండబోతుంది. ఈ విషయం తెలియడంతో అభిమానులు బన్నీకి కంగ్రాట్స్ తెలుసుపుతున్నారు.

Exit mobile version