NTV Telugu Site icon

Allu Arjun: ఈ కాంబో సెట్ అయ్యితే మాస్టారూ.. రికార్డులు గల్లంతే

Bunny

Bunny

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పటినుంచో బాలీవుడ్ ప్రాజెక్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెల్సిందే.. కానీ, ఇప్పటివరకు అది సెట్ అవ్వలేదు. పుష్ప తరువాత బన్నీ రేంజ్ ఓ రేంజ్ లో పెరిగిందని చెప్పొచ్చు.. బాలీవుడ్ ప్రేక్షకులు పుష్ప 2 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్.. వార్ 2 సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా బాలీవుడ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ సందడి చేశాడు. బాలీవుడ్ నిర్మాత మధు మంతెన.. యోగా నిపుణురాలు ఐరా త్రివేదిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. ఇక గతరాత్రి ఈ జంట రిసెప్షన్ ముంబైలోని మారియట్ హోటల్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీలు అందరు విచ్చేసి కొత్త జంటను ఆశీర్వదించారు. ఇక ఈ రిసెప్షన్ లో అల్లు అర్జున్ సందడి చేశాడు.

Minister Roja: మంత్రి రోజాకు అనారోగ్యం.. ఆసుపత్రికి తరలింపు

నూతన వధూవరులను ఆశీర్వదించిన బన్నీని.. బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్.. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ పలకరించారు. హృతిక్.. బన్నీ ని హాగ్ చేసుకొని కొద్దిసేపు ముచ్చటించదు. ఇక పక్కనే అమీర్ ఖాన్ సైతం నవ్వుతూకనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక భవిష్యత్తులో కనుక ఈ కాంబో సెట్ అయితే.. రికార్డులు బద్దలు అయిపోవడం ఖాయమే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. టాలీవుడ్ లో అల్లు అర్జున్ బెస్ట్ డ్యాన్సర్స్ లో ఒకడు .. హృతిక్ బాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్.. వీరిద్దరూ కనుక ఒక ప్రాజెక్ట్ కోసం కలిస్తే.. అదిరిపోతోంది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.