Site icon NTV Telugu

Allu Arjun: అభిమానుల కారణంగా క్యాన్సిల్ అయిన ఫోటోషూట్

Allu Arjun

Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 400 రోజులు అయ్యింది. ఈ మూవీ ముందు వరకూ స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్, పుష్ప ది రైజ్ సినిమాతో ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్నాడు. మొదటి పార్ట్ తో పాన్ ఇండియా ఫేమ్ తెచ్చుకున్న అల్లు అర్జున్, రెండో పార్ట్ పుష్ప ది రూల్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రతి ఇండస్ట్రీలో పాతుకుపోతాడు అని ప్రతి ఒక్కరూ అనుకున్నారు కానీ అల్లు అర్జున్ అండ్ టీం మాత్రం పుష్ప ది రూల్ సినిమాని డిలే చేస్తూనే వచ్చారు. బజ్ తగ్గిపోతుంది, ఆడియన్స్ మర్చిపోతున్నారు, ఒక్క అప్డేట్ అయినా ఇవ్వండి అంటూ అల్లు అర్జున్ ఫాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు.

అఫీషియల్ గా పుష్ప 2 గురించి సుకుమార్ ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా సైలెంట్ గా షూట్ స్టార్ట్ చేసేసాడు. ఇప్పటికే మెయిన్ కాస్ట్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు. పుష్ప ది రైజ్ ని మించేలా, పుష్ప ది రూల్ సినిమాని పర్ఫెక్ట్ గా క్రాఫ్ట్ చేస్తున్నాడు సుకుమార్. ఇటివలే స్టార్ట్ అయిన ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి అల్లు అర్జున్ వైజాగ్ వెళ్లాడు. ఈ సంధర్భంగా ఫాన్స్ అల్లు అర్జున్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఐకాన్ స్టార్ తో ఫోటోస్ కోసం ఎగబడ్డారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే మరోసారి జరిగింది. వైజాగ్ లో అల్లు అర్జున్ టీం, ఫాన్స్ తో ఫోటోషూట్ ప్లాన్ చేశారు. స్టేజ్ కూడా రెడీ అయ్యింది, వైజాగ్ చుట్టుపక్కల ఉన్న అల్లు అర్జున్ ఆర్మీ అంతా ఫోటోస్ కోసం ఎగబడ్డారు. దీంతో చేసేదేమీ లేక అల్లు అర్జున్, కేవలం కొంతమంది ఫాన్స్ కి మాత్రం ఫోటోస్ ఇచ్చి ఫోటోషూట్ సెషన్ ని క్యాన్సిల్ చేసుకోని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అభిమానులని కంట్రోల్ చెయ్యడం కష్టం అయ్యే ఈ ఫోటోషూట్ క్యాన్సిల్ అయ్యింది. తన అభిమాన హీరోని చూడాలని, ఫోటో దిగాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది కానీ మరీ ఇలా మీద పడిపోతే ఎవరూ ఏమీ చెయ్యలేరు.

Exit mobile version