NTV Telugu Site icon

Allu Arjun: కృష్ణంరాజు గారితో ఉండాలని కల కన్నా.. ఇలా వెళ్లిపోతారునుకోలేదు

Bunny

Bunny

Allu Arjun: రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున మృతిచెందిన విషయం విదితమే. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు కన్నుమూశారు. ఇక ఆయన మరణ వార్తతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు అశ్రు నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా కృష్ణంరాజు పార్థివ దేహానికి అల్లు అర్జున్ నివాళులు అర్పించారు. ప్రభాస్ ను హత్తుకొని దైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” ఈ సమయంలో ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు.

కృష్ణంరాజు గారి ఇంటికి రెండు ఇళ్లు పక్కనే మేము కొత్త ఇల్లు కట్టుకొంటున్నాం. మరో ఏడాదిలో పూర్తయిపోతోంది. అప్పుడే అనుకున్నాం. మొదటి నుంచి ఇల్లు కట్టుకొంటే అందరికి ఒక కల ఉంటుంది. తమకిష్టమైన వారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టాలని.. నేను మా ఇల్లు పూర్తయ్యాక కృష్ణంరాజు గారి ఫ్యామిలీని ఇంటికి భోజనానికి పిలుద్దామనుకున్నాను.. కానీ, ఆయన మా ఇంటికి రాకుండానే వెళ్ళిపోతారనుకోలేదు. గ్రేట్ లెజెండ్.. ఆయన గురించి నేను చెప్పేటంతడి వాడిని కూడా కాదు. ఆయనను అభిమానించే ప్రతి ఒక్కరికి, ఆయన కుటుంబానికి, ప్రభాస్ కు నా ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నాను” అని తెలిపారు.

Show comments