Manchu Lakshmi : టాలీవుడ్ లో మంచు లక్ష్మీ మాట్లాడే యాసపై వచ్చే ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. ఆమె ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ లో ఉండటం వల్లనో.. లేదంటే మరేదైనా కారణం ఉందో తెలియదు గానీ.. తెలుగు స్ట్రైట్ గా మాట్లాడకుండా.. ఫారిన్ వాళ్లు మాట్లాడే యాసలోనే మాట్లాడుతూ ఉంటుంది. ఎన్ని ట్రోల్స్ వచ్చినా తన యాస మాత్రం అస్సలు మార్చుకోదు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ కూడా మంచు లక్ష్మీ యాసపై సెటైర్లు వేసింది. అల్లు అర్జున్ ఇంటికి మంచు లక్ష్మీ వచ్చింది. ఈ సందర్భంగా అర్హ, లక్ష్మీ మధ్యలో జరిగిన సంభాషణను అల్లు అర్జున్ స్వయంగా వీడియో తీసి పంచుకున్నారు. సోఫాపై ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అవును నువ్వు నన్ను ఏదో అడగాలి అనుకున్నావంట ఏంటి అని మంచు లక్ష్మీ అడుగుతుంది.
Read Also : Spirit : స్పిరిట్ లో ప్రభాస్ తో నటించే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి
నువ్వు మాట్లాడేది తెలుగేనా అని అర్హ అడుగుతుంది. ‘అవును తెలుగేనే తల్లి. నేను నీతో తెలుగులోనే కదా మాట్లాడుతున్నాను.. నీకెందుకు ఆ డౌట్ వచ్చింది’ అంటుంది లక్ష్మీ. మరి నీ యాస ఏంటి అలా ఉంది అని అర్హ నవ్వేస్తుంది. దానికి మంచు లక్ష్మీ.. ‘నా యాస గురించి నీకెందుకు అంటుంది. దీంతో ఇద్దరూ నవ్వుకుంటారు. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన వారంతా రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో చాలా గొడవలు జరుగుతున్నాయి. వాటిపై ఆమె సైలెంట్ గానే ఉంటూ తన పనులు తాను చేసుకుంటోంది. అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీతో మూవీ చేస్తున్నాడు. ఆ మూవీ షూటింగ్ రీసెంట్ గానే స్టార్ట్ అయింది. ఖాళీ టైమ్ లో వీరంతా ఇలా సందడి చేసినట్టు తెలుస్తోంది.
Read Also : TG Vishwa Prasad : టాలీవుడ్ మూవీస్ బడ్జెట్ పై.. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్..
