NTV Telugu Site icon

Allu Arjun: బావా నీకు ‘బ్లడీ’ బర్త్ డే విషెష్…

Allu Arjun

Allu Arjun

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ కావడంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పేరు ట్రెండ్ అవుతోంది. తారక్ ని బర్త్ డే విషెస్ చెప్తూ సెలబ్రిటీలు కూడా ట్వీట్స్ చేస్తున్నారు. ఈ సమయంలో పుష్పరాజ్ అకా అల్లు అర్జున్ తనదైన స్టైల్ లో ట్వీట్ చేసి ఎన్టీఆర్ ఫాన్స్ కి కిక్ ఇచ్చాడు. అల్లు అర్జున్ కి ఇండస్ట్రీలో ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ లో ఎన్టీఆర్ ఒకడు. ఎప్పుడు ఎలాంటి సందర్భం వచ్చినా ఎన్టీఆర్ పేరు అక్కడ ప్రస్తావించాల్సి వస్తే అల్లు అర్జున్ ఆలోచించకుండా ఎన్టీఆర్ గురించి చెప్తాడు. ఈ రిలేషన్షిప్ ని అలానే మైంటైన్ చేస్తూ “మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బావా… హాప్ యు హ్యావ్ ఎ బ్లడీ గుడ్ బర్త్ డే” అని ట్వీట్ చేసాడు.

Read Also: Hrithik Roshan: నీకోసం యుద్ధభూమిలో వేచి చూస్తున్న తారక్.. రా చూసుకుందాం

‘దేవర’ సినిమా ఫస్ట్ లుక్ అంతా బ్లడ్ తో ఉండడంతో ఇక్కడ బ్లడీ అనే వర్డ్ ని బ్రాకెట్స్ లో పెట్టాడు అల్లు అర్జున్. ఇప్పుడు ఈ ట్వీట్ ని ఎన్టీఆర్ ఎలాంటి రిప్లై ఇస్తాడు అనే క్యూరియాసిటీలో ఉన్నారు అల్లు అర్జున్ అండ్ ఎన్టీఆర్ మ్యూచువల్ ఫాన్స్. ఎందుకంటే గత నెల అల్లు అర్జున్ బర్త్ డే సమయంలో బన్నీకి విషెస్ చెప్తూ ఎన్టీఆర్ చేసిన ట్వీట్, దానికి అల్లు అర్జున్ ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో ఒక రోజంతా హాట్ టాపిక్ అయ్యింది. మరి ఈసారి ఈ ఇద్దరి మధ్య ఎలాంటి డిస్కషన్ జరుగుతుంది. అది సోషల్ మీడియాలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.