“పుష్ప” సక్సెస్‌తో దూసుకుపోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు 40 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. “పుష్ప” ఇచ్చిన సక్సెస్ తో ఈ బర్త్ డేను మరింత ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేసుకున్నాడు బన్నీ. అయితే ఆ సెలెబ్రేషన్స్ ఇక్కడ కాదు విదేశాల్లో జరిగాయి. Allu Arjun Birthday Celebrationsకి సంబంధించిన పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఐకాన్ స్టార్ పుట్టినరోజు వేడుకలు సెర్బియాలో జరిగాయి. బర్త్ డే కోసమే కుటుంబంతో సహా తనకు అత్యంత సన్నిహితులైన 50 మందిని తీసుకుని సెర్బియాలోని బెల్‌గ్రేడ్ కు వెళ్ళాడు. ఇక ఈ టీం అంతా కలిసి అక్కడ గ్రాండ్ గా పుట్టినరోజును జరుపుకున్నారు.
Read Also : Shoot Life: విష్ణు విషయంలో మరోసారి భంగపడ్డ పోర్న్ స్టార్!
మరోవైపు సోషల్ మీడియాలో బన్నీకి బర్త్ డే విషెస్ వెల్లువలా వచ్చి పడుతున్నాయి. బన్నీ అభిమానులు, అలాగే సెలెబ్రిటీలు ట్వీట్స్ ద్వారా ఇసోన్ స్టార్ ను విష్ చేశారు. ఇక హైదరాబాద్ లోనూ బన్నీ అభిమాన సంఘాలు కూడా ఐకాన్ స్టార్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించాయి. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు ఫుడ్ ను పంచిపెట్టడమే కాకుండా, మొక్కలు కూడా నాటారు. కాగా అల్లు అర్జున్ ఇప్పుడు “పుష్ప” సీక్వెల్ “పుష్ప : ది రూల్” షూటింగ్ ను స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Allu Arjun
