AlluArjun-Atlee : అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్ లో భారీ ప్రాజెక్ట్ వస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ సంస్థ దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తోంది. భారీ వీఎఫ్ ఎక్స్ విజువల్ గా దీన్ని తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేస్తున్న కొన్ని ఇమాజినేషన్ పిక్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఈ సినిమాలోకి భారీగా స్టార్లను తీసుకుంటున్నారు. తాజాగా మూవీ విలన్ గురించే పెద్ద చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో విలన్ గా ఇండియన్ యాక్టర్స్ ను కాకుండా హాలీవుడ్ యాక్టర్స్ ను తీసుకోవాలని భావిస్తున్నారంట. ఇందుకోసం ప్రధానంగా ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నారు. వారిలో ఒకరు విల్ స్మిత్, మరొకరు డ్వెన్ జాన్సన్. వీరిద్దరూ హాలీవుడ్ లో స్టార్ యాక్టర్స్.
Read Also : Bhahubali : ‘బాహుబలి’ రీరిలీజ్‌పై జక్కన్న గ్రాండ్ అప్డేట్..
కానీ వీరిద్దరి బల్క్ డేట్స్ పట్టుకోవడమే పెద్ద టాస్క్. పైగా రెమ్యునరేషన్ కూడా పదింతలు ఎక్కువ అవుతుంది. అయినా సరే అట్లీ మాత్రం వారిలో ఒకరిని తీసుకోవాలని చూస్తున్నాడంట. ఇందుకోసం బిల్లు ఎంతైనా పర్లేదు అన్నట్టే ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. కానీ అట్లీకి ఓ స్పెషాలిటీ ఉంది. ఇచ్చిన డేట్స్ లోపలే షూటింగ్ ను కంప్లీట్ చేసేస్తాడు. అది నిర్మాతలకు ప్లస్ పాయింట్. ఈ సినిమాను కూడా వచ్చే 2027 వరకు ఫినిష్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడంట. కుదిరితే 2026 ఇయర్ ఎండింగ్ వరకే తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే 2027 సంక్రాంతికి మూవీని ప్లాన్ చేస్తున్నారంట. ఇంతటి స్టార్లతో భారీగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాను అట్లీ ఏ స్థాయిలో తీస్తాడో.. ఇందులో బన్నీ ఎలా కనిపిస్తాడో వేచి చూడాల్సిందే.
Read Also : R Madhavan : వయసు కాదు.. కెమిస్ట్రీ ముఖ్యం
