Site icon NTV Telugu

థియేటర్ లో అల్లు అర్జున్… పోటెత్తిన ఫ్యాన్స్

Allu-arun

ఈరోజు మొత్తం ‘పుష్ప’రాజ్ దే… ఎక్కడ చూసినా ‘పుష్ప’ గురించే టాక్ నడుస్తోంది. సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. థియేటర్లలో ‘పుష్ప’రాజ్ ఫ్యాన్స్ చేసే రచ్చ మాములుగా లేదు. అయితే తాజాగా అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ కు ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. అక్కడ అభిమానులతో కలిసి సినిమా చూడడానికి ప్లాన్ చేసుకున్నాడు అల్లు అర్జున్. అయితే ఆయన వస్తున్నాడన్న సమాచారం ముందుగానే ప్రచారం జరగడంతో అక్కడికి భారీ ఎత్తున ఫ్యాన్స్ తరలి వచ్చారు. అల్లు అర్జున్ అక్కడికి చేరుకోగానే అరుపులు, కేకలతో రచ్చ రచ్చ చేశారు. ఇప్పటికే సినిమాను వీక్షించిన ప్రేక్షకులు తగ్గేదే లే అంటూ పాజిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేస్తుంటే… ఇలా అల్లు అర్జున్ థియేటర్ కు రావడంతో ఫ్యాన్స్ సంతోషానికి అంతే లేకుండా పోయింది. ఇక బన్నీ రావడంతో అభిమానులు చుట్టుముట్టగా, పోలీసుల భారీ భద్రత మధ్య అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి థియేటర్లోకి చేరుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Read Also : బన్నీ ‘తగ్గేదే లే’… చరణ్ స్పెషల్ ట్వీట్

Exit mobile version