Allu Arjun: థాంక్స్ చెప్తే చాలదు.. అదిరే పాటలు కావాలి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun Asks Anirudh to Compose Great songs for him: షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు వందల కోట్ల కలెక్షన్లు సాధిస్తూ అనేక రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు దూసుకు పోతుంది. ఇక ఈ సినిమా చూసి సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలు సైతం ప్రసంశలు కురిపిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ సినిమా చూసిన అల్లు అర్జున్ ఈ సినిమా మీద సినిమా యూనిట్ మీద ప్రశంసల వర్షం కురిపించాడు. జవాన్ సినిమాకి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్, విజయ్ సేతుపతి, నయనతార, దీపికా వంటి అందరినీ పేరు పేరున అడ్రెస్ చేస్తూ అల్లు అర్జున్ ట్వీట్ చేసాడు. అల్లు అర్జున్ ట్వీట్ చేస్తూ ఈ భారీ బ్లాక్ బస్టర్ కోసం జవాన్ టీమ్ మొత్తానికి అభినందనలు, జవాన్ మొత్తం తారాగణం, సాంకేతిక నిపుణులు, సిబ్బంది & నిర్మాతలకు హృదయపూర్వక నమస్కారాలు అని అల్లు అర్జున్ రాసుకొచ్చడు.
Vijay Deverakonda: మాట నిలబెట్టుకుంటూ… 100 కుటుంబాలకి 100000 ఇచ్చాడు
Also Read
- Fauzi Shooting Update: 'ఫౌజీ' కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
- Spirit: స్పిరిట్ షూటింగ్'కి నెల రోజుల బ్రేక్
- Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
షారుఖ్ అందరినీ ఆకట్టుకున్నాడు, విజయ్ సేతుపతి గారు ఎప్పటిలాగే తన పాత్రలో చాలా అద్భుతంగా ఉన్నారు. దీపికపదుకొనే చాలా అందంగా కనిపించింది. నయనతార జాతీయ స్థాయిలో మెరిసింది. అనిరుధ్ మీరు దేశంలోని ప్రతి ఒక్కరినీ మీ సంగీతాన్ని హమ్ చేసేలా చేస్తున్నారు. మనందరినీ గర్వించేలా, ఆలోచింపజేసే కమర్షియల్ సినిమాని అందించి భారతీయ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించినందుకు దర్శకుడు అట్లీ గారికి బిగ్గ్ బిగ్గ్ అభినందనలు అని అంటూ ఆయన రాసుకొచ్చాడు. అయితే దాని అనిరుధ్ స్పందిస్తూ థాంక్యూ మై బ్రో అని పోస్ట్ చేశారు, దానికి అల్లు అర్జున్ ఒట్టి థాంక్స్ చెబితే చాలదు, నాకు కొన్ని గ్రేట్ పాటలు కావాలి అని అంటూ రాసుకొచ్చాడు. నిజానికి కొన్ని రోజులుగా అట్లీ నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ తో చేయబోతున్నాడు అనే వార్త వినిస్తోంది.. అంతేకాక జవాన్ లో సంజయ్ దత్ రోల్ చేయమంటే సినిమా చేస్తానని ఈ రోల్ చేయలేనని చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఇలాంటి క్రమంలో ఈ ట్వీట్ మరింత వైరల్ అవుతోంది. అంటే అట్లీ అల్లు అర్జున్ సినిమా కోసం అనిరుధ్ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ అట్లీ కలిసి సినిమా చేస్తే ఆ లెక్కలు మామూలుగా ఉండవు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!