యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. ఈ సినిమా అక్టోబర్ 15న విడుదలకు సిద్ధంగా ఉంది. అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జిఎ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపి సుందర్ సంగీతం అందించారు. ఈ క్రమంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెషన్ లో నిర్వహించారు. ఈ వేడుకకు అతిథిగా విచ్చేసిన నిర్మాత అల్లు అరవింద్ పూజ హెగ్డే గ్లామర్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Read Also : రోజులు, పరిస్థితులు మారతాయి : నాగ చైతన్య
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ “అక్కినేని అభిమానులందరికి నమస్తే. ఇప్పటికే ఆలస్యమైందని అర్థమవుతోంది. అందుకే 5 నిమిషాల్లో చెప్పాలనుకుంది చెప్పేస్తా. ముఖ్య అతిథిగా విచ్చేసిన మా హీరో చైతూ… మ్యూజిక్ డైరెక్టర్ నా దగ్గరకు వచ్చే ప్రతీ సినిమాను ఆయన దగ్గరకు తీసుకెళ్ళమంటాను. ఆయన టైం లేక సినిమాలు చేయలేకపోతున్నారు కొన్నిసార్లు. మీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కొంతమంది దర్శకుల మీద చాలా ప్రేమ ఉంటుంది. ఈ బన్నీ వాసుకు నీపై ఇంత ప్రేమ ఎందుకు ఉందా ? అని ఆరా తీస్తే మీ మధ్య ఎప్పుడో 18 ఏళ్ల జర్నీ ఉందని తెలిసింది. అప్పుడు అర్థమైన భాస్కర్ ను పట్టుకుని ఎందుకు వేలాడతాడా అని. ఆయనను పట్టుకుని మూడు నాలుగు కథలు తీసుకొచ్చాడు బన్నీ వాసు నా దగ్గరకు. అఖిల్ గురించి చెప్పాలంటే… మా మధ్య అన్ సెడ్ ప్రామిస్ ఉంది. మీ నాన్న మధ్య నా మధ్య ఉన్న ఆ ప్రామిస్ ని నేను ఫుల్ ఫిల్ చేశాను. ఇక పూజా మై లవ్ యాజ్ ఎవర్ ఎవర్… ఎప్పటికన్నా ఈ సినిమాలో ను బాగా నటించావు. గ్లామర్ తో పాటు నటించే హీరోయిన్లు చాలా తక్కువ. ఆ జాబితాలో పూజా హెగ్డే ఉంది” అంటూ ముగించారు.