Sai Pallavi: అల్లు అరవింద్ నాకు తండ్రితో సమానం : సాయి పల్లవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. ‘కార్తికేయ-2’ లాంటి బంపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో, సక్సెస్ఫుల్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, గీతాఆర్ట్స్ బ్యానర్‌పై.. ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక రిలీజ్ సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ ఓ రేంజ్లో చేస్తుంది. కాగా రిసెంట్ గా ఈ మూవీ తమిళ ట్రైలర్‌ను చెన్నైలో విడుదల చేశారు. కోలీవుడ్ స్టార్ కార్తి ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంంలో డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్, డైరెక్టర్ వెంకట్ ప్రభు సహా చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ సందర్బంగా… సాయి పల్లవి మాట్లాడుతూ వైరల్ కామెంట్ లు చేసింది.
సాయి పల్లవి మాట్లాడుతూ ‘మా ఈ ‘తండేల్’ చిత్రం యూనిట్‌ను ఆశీర్వదించటానికి ఇక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. ముందుగా ఈ కథను ఓ రియల్ స్టోరీలాగా చెప్పారు.కానీ తర్వాత దాన్ని అందమైన ప్రేమ కథగా మార్చారు. ఈ జర్నీకి మూడేళ్ల సమయం పట్టింది. పిక్చరైజేషన్కి ఏడాదిన్నర సమయం పట్టింది. చైతన్య అద్భుతంగా తన పాత్రలో ఒదిగిపోయి ప్రాణం పెట్టి నటించారు. దేవిశ్రీగారు అందమైన పాటలను ఇచ్చారు. సినిమా రిలీజ్‌కు ముందే ఆడియెన్స్ పాటలను పెద్ద హిట్ చేసి మా అందరికీ ఎనర్జీని ఇచ్చారు. అరవింద్‌గారు నాకు తండ్రితో సమానం. ఏడాదిన్నర పాటు సినిమాను షూట్ చేసినప్పుడు ఎక్కడా ఇబ్బంది లేకుండా మా టీమ్‌కు సపోర్ట్‌ను అందించారు. కరుణాకరన్‌గారికి తెలుగు ఇండస్ట్రీలోకి స్వాగతం చెబుతున్నాను. అద్భుతంగా నటించారు. ఈ జర్నీలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఫిబ్రవరి 7న సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అని తెలిపింది సాయి పల్లవి. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి - మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
- Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
- Johnny Master - Sekhar Master: టాలీవుడ్లో కలకలం.. జానీ మాస్టర్ - శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్
- Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే డ్రీమ్ రోల్ ఇదేనట.. రాజమౌళి పేరు చెప్పి షాకిచ్చిన హీరోయిన్!
తాజావార్తలు
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
-
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..