NTV Telugu Site icon

Ugram Trailer: నరేష్ ఉగ్ర రూపం.. ఇదయ్యా నీ నట విశ్వరూపం

Naresh

Naresh

Ugram Trailer: అల్లరి నరేష్ నుంచి నరేష్ గా మారిపోయాడు అల్లరోడు. కామెడీ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న నరేష్ కాదు ఇప్పుడు ఉన్నది. ఒక నటుడుగా పరిణీతి చెందుతూ.. నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం లాంటి సినిమాలతో నరేష్ ఇంకో సైడ్ ను చూపిస్తున్నాడు. ఇక అందులో భాగంగానే నరేష్ నుంచి వస్తున్న మరో కొత్త చిత్రం ఉగ్రం. నాంది లాంటి మంచి హిట్ ను నరేష్ కు ఇచ్చిన విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకోవడమే కాకుండా గూస్ బంప్స్ ను తెప్పిస్తుంది. ఒక పవర్ ఫుల్ కాన్సెప్ట్ తో నాంది కాంబో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Naresh: ‘మళ్లీ పెళ్లి’లో కృష్ణ, విజయ్ నిర్మల.. ఎవరో గుర్తుపట్టారా ..?

ప్రస్తుతం మన దేశం ఎదుర్కుంటున్న అతి పెద్ద సమస్యలో సెక్స్ రాకెట్ ఒకటి. చిన్నపిల్లలు, ఆడవారు అని కనికరం కూడా లేకుండా వారిని కిడ్నాప్ చేసి వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారు. వారి బతుకులను బజారుకీడ్చి.. దానిపై వచ్చేహ్ సొమ్ముతో మేడలు కట్టేస్తున్నారు బడా వ్యాపారస్తులు. ఇక ఆ కేసును హ్యాండిల్ చేయడానికి వచ్చినవాడే శివ కుమార్. చిన్నపిల్లలతో పాటు తన భార్య, కూతురును కూడా పోగొట్టుకుంటాడు. వారికోసం ఒక పోలీసాఫీసర్.. సెక్స్ రాకెట్ మాఫియాతో ఎలా తలపడ్డాడు అనేదే ఉగ్రం కథ. నరేష్ నట విశ్వరూపం. ఎంతో ఆనందంగా.. భార్యాపిల్లలతో జీవితం సాగిస్తున్న ఒక పోలీసాఫీసర్.. వారిని పోగొట్టుకొని, మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి.. చివరికి ఆ వ్యవస్థను ఎలా నాశనం చేశాడు.. ఆ పోరాటంలో గెలిచాడా..? చివరికి భార్యాపిల్లను దక్కించుకున్నాడా..? అనేది ఎంతో ఉత్కంఠగా తెరకెక్కించాడు డైరెక్టర్. ఇక నరేష్ నట విశ్వరూపం ఈ సినిమాలో చూడొచ్చు. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నరేష్ నటన అద్భుతం. శ్రీ చరణ్ పాకాల సంగీతం సినిమా మొత్తానికి హైలైట్. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో నరేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలంటే.. మే 5 వరకు ఆగాల్సిందే.

Show comments