Site icon NTV Telugu

Itlu Maredumilli Prajaneekam: రెండు వారాలు వెనక్కి వెళ్ళిన నరేశ్ మూవీ!

N (1)

N (1)

Itlu Maredumilli Prajaneekam:’అల్లరి’ నరేశ్‌ నటించిన ‘నాంది’ సినిమా చక్కని విజయాన్ని సొంతం చేసుకోవడంతో అతను కామెడీ చిత్రాలతో పాటు కంటెంట్ ప్రధానమైన చిత్రాలనూ చేయడం మొదలెట్టాడు. అలా రూపుదిద్దుకున్నదే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా. అలానే ‘నాంది’ దర్శకుడితో ‘ఉగ్రం’ అనే సినిమా కూడా చేస్తున్నాడు నరేశ్‌. ఇదిలా ఉంటే… ఎ. ఆర్. మోహన్ దర్శకత్వంలో జీ స్టూడియోస్ సహకారంతో రాజేశ్ దండా నిర్మించిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ మూవీ ఈ నెల 11న విడుదల కావాల్సింది. అయితే దీనిని ఈ నెల 25న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత తెలిపారు.

ఈ చిత్రంలో అల్లరి నరేష్‌ గిరిజన ప్రాంతమైన మారేడుమిల్లిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. తాజా రిలీజ్ డేట్ ని తెలియచేస్తూ విడుదల చేసిన పోస్టర్‌ లో గిరిజన ప్రాంతంలో పోలీసు అధికారులతో ప్రయాణిస్తూ విచారిస్తున్నట్లు కనిపించారు అల్లరి నరేష్. ఆనంది కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘వెన్నెల’ కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రలను పోసించారు. బాలాజీ గుత్తా సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. రాంరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. అబ్బూరి రవి మాటలు అందించగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Exit mobile version