Site icon NTV Telugu

OTT Updates: ఓటీటీలో ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Itlu Maredumilli Prajaneekam

Itlu Maredumilli Prajaneekam

OTT Updates: హీరోగా ఎన్నో సినిమాల తర్వాత అల్లరి నరేష్‌కు నాంది రూపంలో హిట్ దొరికింది. ఆ సినిమా ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో డిఫరెంట్ సబ్జెక్టులను అల్లరోడు ఎంచుకుంటున్నాడు. ఇటీవల ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భిన్న కథాంశంతో తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం అనుకున్న విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 23 నుంచి ఈ చిత్రం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

Read Also: Cockroach in Food: రైల్వే భోజనంలో బొద్ధింక.. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఘటన

మెసేజ్ ఓరియెంటెడ్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమాతో ఏ.ఆర్ మోహ‌న్ ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. ఆనంది, వెన్నెల‌ కిషోర్‌, సంప‌త్‌రాజ్ కీల‌క పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌, హాస్య మూవీస్‌ సంయుక్తంగా నిర్మించాయి. పోటీగా ఎలాంటి సినిమాలు లేకపోయినా బ్రేక్‌ ఈవెన్‌ సాధించలేకపోయింది. నిజానికి జీ5 తొలుత ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో స్ట్రీమింగ్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే అనుకున్న సమయానికంటే ముందుగానే సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారు.

Exit mobile version