సలార్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచే… రిలీజ్ కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసేశారు ప్రభాస్ ఫ్యాన్స్. 250, 200, 150, 100, 50 రోజులు అంటూ కౌంట్ డౌన్ చేస్తునే ఉన్నారు. ఫైనల్‌గా సలార్ తుఫాన్ తీరం తాకే సమయం ఆసన్నమైంది. మరో నాలుగు వారాల్లో బాక్సాఫీస్‌ను కమ్మేయనుంది సలార్ తుఫాన్. డిసెంబర్ 22 బాక్సాపీస్ దగ్గర జరగబోయే తుఫాన్ భీభత్సం మామూలుగా ఉండదు కానీ డిసెంబర్ 1న శాంపిల్‌గా తీరాన్ని తాకనుంది సలార్ తుఫాన్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సలార్ ట్రైలర్ రిలీజ్‌కు మరో వారం రోజులు మాత్రమే ఉంది. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో సలార్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. లేటెస్ట్‌గా రిలీజ్ అయిన యానిమల్ ట్రైలర్‌కు మించి… సలార్ ట్రైలర్ మరింత వైలెంట్‌గా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.
ఇదే జోష్‌లో నెక్స్ట్ ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబోలో రానున్న స్పిరిట్‌ను కూడా ట్రెండ్ చేస్తున్నారు కానీ సలార్ ట్రైలర్ మాత్రం పీక్స్ అనేలా ఉంటుందనే నమ్మకంతో ఉన్నారు. టీజర్‌లో డైనోసర్ అంటూ ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్‌ను ఊహించుకొని.. ట్రైలర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రజెంట్ హై ఓల్టేజ్ ట్రైలర్ కట్ చేసే పనిలో ఉన్నాడు ప్రశాంత్ నీల్. ఈ పవర్ ప్యాక్డ్ ట్రైలర్ బయటికి రావడమే లేట్.. డిజిటల్ రికార్డ్స్ అన్ని చెల్లా చెదురు కానున్నాయి. ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ప్రభాస్‌కు జోడీగా శృతిహాసన్ నటిస్తుండగా… మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడు. కెజియఫ్ తర్వాత హోంబలే సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో సలార్‌ను నిర్మిస్తోంది. మరి ఇంత హైప్ ఉన్న సలార్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
