#AllHailTheTiger అనే ట్యాగ్ తో దేవర టీజర్ గురించి అనిరుథ్ ఏ టైమ్ లో ట్వీట్ చేసాడో కానీ అప్పటినుంచి సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాని షేక్ చేసే పనిలో ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దేవర ట్యాగ్ ని, #AllHailTheTiger ట్యాగ్ ని, ఎన్టీఆర్ పేరుని ట్రెండ్ చేస్తున్నారు. కొరటాల శివ దేవర సినిమాలో ఎన్టీఆర్ భయానికే భయం పుట్టించే వీరుడిలా కనిపిస్తాడని చెప్పేసాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం దేవర టీజర్ న్యూఇయర్ కి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ న్యూఇయర్ మిస్ అయితే సంక్రాంతి పండక్కి దేవర టీజర్ సోషల్ మీడియాపై దండయాత్ర చెయ్యడం గ్యారెంటీ. టీజర్ ని అన్ని భాషల్లో రిలీజ్ చేసి పాన్ ఇండియా ప్రమోషన్స్ ని స్టార్ట్ చెయ్యడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు.
రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్ 1 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. అనౌన్స్మెంట్ నుంచే హ్యూజ్ హైప్ ని మైంటైన్ చేస్తున్న దేవర సినిమాపై అంచనాలని మరింత పెంచుతూ టీజర్ ని రిలీజ్ ని గ్రాండ్ గా కట్ చేస్తే చాలు దెబ్బకి ఇండియా మొత్తం ఎన్టీఆర్ మేనియాతో ఊగిపోతోంది. దేవర బ్లడ్ బాత్ టీజర్ లో… దేవర కోసం కొరటాల శివ క్రియేట్ చేసిన వరల్డ్ నే ఎక్కువగా ప్రెజెంట్ చేసే అవకాశం ఉంది. కథ గురించి హింట్స్ తక్కువగా ఇచ్చి స్కేల్ ఏ రేంజులో ఉండబోతుంది అనే విషయంపైనే దేవర మేకర్స్ దృష్టి పెడతారు. సో దేవర నుంచి వచ్చే టీజర్ విజువల్ స్పెక్టక్యులర్ గా ఉండబోతుంది అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.