December Clash: అన్ని వేళ్లు పుష్పా వైపే..అసలు కారణం ఏంటంటే..?
- పుష్ప 2 డిసెంబరు 6న రిలీజ్
- మిగతా సినిమాల పరిస్థితి గందరగోళం
- ఇప్పటికీ పుష్ప డిసెంబర్ రిలీజ్ డౌటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎక్కడో సీతాకోక చిలుక గాల్లో ఎగిరితే, ఇంకెక్కడో వర్షం పడినట్టుంది రాబోయే డిసెంబరు సినిమాల పరిస్థితి. ఒక్క సినిమా కారణంగా అరడజను చిత్రాలు ఇబ్బందుల్లో పడ్డాయి. ఆకారణమైన సినిమానే పుష్ప-2. రెండేళ్లుగా షూటింగ్ జరుగుతూనే ఉంది బన్నీ, సుకుమార్ ల పుష్ప -2. వాస్తవానికి ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కావలి. అలా చేస్తామని కూడా అధికారంగా ప్రకటించారు మేకర్స్. దీంతో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలు డిసెంబరుకు వచ్చేలా షూటింగ్ చేస్తున్నాయి. కొన్ని సినిమాల షూటింగ్ చివరి దశలో ఉంది. కానీ ఇప్పుడు పుష్ప -2 ఈ నెలలో జరగాల్సిన షెడ్యూల్ కొన్ని కారణాలవలన వాయిదా వేశారు. దాంతో ఆగస్టులో విడుదల పోస్ట్ పోన్ అయింది. దీంతో మిగిలిన సినిమాలకు ఇబ్బంది ఏర్పడింది. కాగా పుష్ప -2ను డిసెంబరు 6న విడుదల చేయనున్నట్టు మరొక అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్.
ఇప్పుడు వివాదం మరింత పెద్దదయింది. పుష్ప ఆగస్టులో వచ్చేస్తుందని మంచు విష్ణు నటిస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ డిసెంబరు డేట్ లాక్ చేసుకుంది. ఇపుడు వారు వెనక్కి తగ్గేదే లేదని ప్రకటించారు. ఇక నాగ చైతన్య తండేల్ పుష్ప రాకతో డైలమాలో పడింది. నితిన్ రాబిన్ హుడ్ చిత్రానిది ఇదే పరిస్థితి. ఒక వేళ పుష్ప 2 కనుక డిసెంబర్ లో రాకపోతే అదే డేట్ కు వేసేలా ధనుష్, శేఖర్ కమ్ముల ‘కుబేర’ నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు బాలయ్య, సినిమా కూడా డీసెంబరు ప్లానింగ్ లో ఉంది. శంకర్, చరణ్ ల గేమ్ ఛేంజర్ డిసెంబరు 25 విడుదల పక్కా. ఈ గందరగోళానికి కారణం పుష్ప అనేది మిగిలిన వారి లోపలి మాట.
Also Read
- Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
Also Read: TG Health Department: కురుస్తున్న భారీ వర్షాలు.. ఆరోగ్య శాఖ సూచనలు..
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!