NTV Telugu Site icon

December Clash: అన్ని వేళ్లు పుష్పా వైపే..అసలు కారణం ఏంటంటే..?

Untitled Design (9)

Untitled Design (9)

ఎక్కడో సీతాకోక చిలుక గాల్లో ఎగిరితే, ఇంకెక్కడో వర్షం పడినట్టుంది రాబోయే డిసెంబరు సినిమాల పరిస్థితి. ఒక్క సినిమా కారణంగా అరడజను చిత్రాలు ఇబ్బందుల్లో పడ్డాయి.  ఆకారణమైన సినిమానే పుష్ప-2.  రెండేళ్లుగా షూటింగ్ జరుగుతూనే ఉంది బన్నీ, సుకుమార్ ల పుష్ప -2. వాస్తవానికి ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కావలి. అలా చేస్తామని కూడా అధికారంగా ప్రకటించారు మేకర్స్. దీంతో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలు డిసెంబరుకు వచ్చేలా షూటింగ్ చేస్తున్నాయి. కొన్ని సినిమాల షూటింగ్ చివరి దశలో ఉంది. కానీ ఇప్పుడు పుష్ప -2 ఈ నెలలో జరగాల్సిన షెడ్యూల్ కొన్ని కారణాలవలన వాయిదా వేశారు. దాంతో ఆగస్టులో విడుదల పోస్ట్ పోన్ అయింది. దీంతో మిగిలిన సినిమాలకు ఇబ్బంది ఏర్పడింది. కాగా పుష్ప -2ను డిసెంబరు 6న విడుదల చేయనున్నట్టు మరొక అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్.

ఇప్పుడు వివాదం మరింత పెద్దదయింది. పుష్ప ఆగస్టులో వచ్చేస్తుందని మంచు విష్ణు నటిస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ డిసెంబరు డేట్ లాక్ చేసుకుంది. ఇపుడు వారు వెనక్కి తగ్గేదే లేదని ప్రకటించారు. ఇక నాగ చైతన్య తండేల్ పుష్ప రాకతో డైలమాలో పడింది. నితిన్ రాబిన్ హుడ్ చిత్రానిది ఇదే పరిస్థితి. ఒక వేళ పుష్ప 2 కనుక డిసెంబర్ లో రాకపోతే అదే డేట్ కు వేసేలా ధనుష్, శేఖర్ కమ్ముల ‘కుబేర’ నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు బాలయ్య, సినిమా కూడా డీసెంబరు ప్లానింగ్ లో ఉంది. శంకర్, చరణ్ ల గేమ్ ఛేంజర్ డిసెంబరు 25 విడుదల పక్కా. ఈ గందరగోళానికి కారణం పుష్ప అనేది మిగిలిన వారి లోపలి మాట.

 

Also Read: TG Health Department: కురుస్తున్న భారీ వర్షాలు.. ఆరోగ్య శాఖ సూచనలు..

Show comments