Alipiriki Allantha Dooramlo Trailer: ఏడుకొండల స్వామి డబ్బు తిన్నవాడు ఎవడు బాగుపడడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alipiriki Allantha Dooramlo Trailer: నూతన నటుడు రావణ్ నిట్టూర్, శ్రీ నికిత జంటగా డైరెక్టర్ నందిని రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన ఆనంద్ జె దర్శకత్వం వహిస్తున్న చిత్రం అలిపిరికి అల్లంత దూరంలో. క్యాస్కేడ్ పిక్చర్స్ బ్యానర్ పై రమేష్ డబ్బుగొట్టు మరియు రెడ్డి రాజేంద్ర పి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టైటిల్ ను బట్టే తెలిసిపోతుంది ఈ సినిమా అంతా తిరుపతి చుట్టూ పక్కల ప్రాంతోలలోనే తీసారని.. ఇక కథ విషయానికొస్తే.. చదువు, డబ్బు లేని ఒక యువకుడు గుడి వద్ద స్వామివారి పాఠాలను అమ్ముకుంటూ ఉంటాడు.. అతనికి ఆ జీవితం నచ్చదు.. ఈ క్రమంలోనే హీరోయిన్ అతడి ప్రేమలో పడుతోంది.
దరిద్రంతో నిండిపోయిన అతడి జీవితంలో అమ్మాయి ప్రేమే అదృష్టంగా భావిస్తాడు హీరో.. అంతలోనే వీరి ప్రేమ వ్యవహారం అమ్మాయి ఇంట్లో తెలియడం, ఆమె దూరం అవ్వడం, వాళ్ళ నాన్న డబ్బులేదని యువకుడును హేళన చేసి వెళ్లపోవడంతో ఎలాగైనా డబ్బు సంపాదించి ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవాలని ఏడుకొండల స్వామికి కానుకగా వేయాలన్న డబ్బును దొంగిలిస్తారు. ఆ డబ్బు ఒక మాఫియా కింగ్ ది కావడంతో కథ అడ్డం తిరుగుతోంది. అసలు ఆ డబ్బు ఎవరిది..? దొంగతనంచేసిన డబ్బు చేతులు ఎలా మారింది. చివరికి ఈ ప్రేమ జంట కలిశారా..? లేదా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశాడు డైరెక్టర్. అలిపిరికి అల్లంత దూరంలో’ చిత్రాన్ని నవంబర్ 18న థియేటర్లలో విడుదల చేయనున్నారు.మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read
- Kaala Hiran Controversy : ఆ సినిమా విడుదలను ఆపేయండి... కొత్త వివాదంలో కోర్టుకెక్కిన సల్మాన్ ఖాన్
- AK64 : రెమ్యూనరేషన్ చిక్కుల్లో తల... 200 నుంచి 100 కోట్లకు పడిపోయిందా ?
- Mollywood Times Controversy : 'మాలీవుడ్ టైమ్స్' నిర్మాతలపై సెన్సార్ టీం గరం గరం... మ్యూట్ చేసిన పదాలతో సినిమా రిలీజ్
- Allu Arjun Happy: హ్యాపీ రీ రిలీజ్'తో కేరళలో అల్లు అర్జున్ సెన్సేషన్.!
తాజావార్తలు
-
Road Tax: ఆ కారు కొనాలనుకునే వాళ్లకు గుడ్‌న్యూస్.. 50% రోడ్ టాక్స్ మినహాయింపు!
-
Story Board: ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? యుద్ధం పేరు చెప్పి గేమ్స్ ఏంటి..?
-
Drishyam 3 OTT: మోహన్ లాల్ దృశ్యం 3 ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
-
Kaala Hiran Controversy : ఆ సినిమా విడుదలను ఆపేయండి… కొత్త వివాదంలో కోర్టుకెక్కిన సల్మాన్ ఖాన్
-
Most Beautiful Waterfalls in India: భారతదేశపు నయాగరా నుంచి దూద్‌సాగర్ వరకు.. సందర్శించాల్సిన టాప్ జలపాతాలు ఇవే..
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!