Site icon NTV Telugu

సరస్సు ముంగిట సూర్యాస్తమయాన్ని ఆస్వాదించిన ప్రేమజంట!

Alia Bhatt Wishing Ranbir Kapoor on his Birthday

కరోనా మహమ్మారి రాకపోయి ఉంటే… ఈ పాటికి బాలీవుడ్ స్టార్ కిడ్స్ రణబీర్ కపూర్, అలియా భట్ ఎంచక్కా పెళ్ళి పీటలు ఎక్కేసి ఉండేవారు. కానీ పేండమిక్ సిట్యుయేష్ వారి ఆశలు, ఆనందాలపై నీళ్ళు కుమ్మరించింది. అయితే… ఈ కష్టకాలంలోనూ ఒకరికి ఒకరు బాసటగా ఉంటూ ఈ ప్రేమజంట ఆనందం పొందుతోంది. సెప్టెంబర్ 28 మంగళవారం నాడు రణబీర్ కపూర్ తన 39వ పుట్టిన రోజును జోద్ పూర్ లో ప్రియురాలు అలియా భట్ తో కలిసి జరుపుకున్నాడు. అదే రోజు సూర్యాస్తమయం సమయంలో రణబీర్ తో కలిసి అక్కడి ఓ సరస్సు ముందు క్వాలిటీ టైమ్ ను అలియా స్పెండ్ చేసింది. ఆ ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ, ‘హ్యాపీ బర్త్ డే మై లైఫ్’ అని అలియా పేర్కొంది. తమ పెళ్ళికి సంబంధించిన వేదికను ఖరారు చేయడానికి ఆ ప్రేమజంట జోద్ పూర్ వెళ్ళిందనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా… అతి త్వరలోనే వీరిద్దరూ కలిసి ఏడు అడుగులు వేయడం ఖాయం.

Read Also : కట్స్ లేకుండానే జనం ముందుకు జేమ్స్ బాండ్!

ఇక సినిమాల విషయానికి వస్తే, రణబీర్ కపూర్, అలియా భట్ తొలిసారి అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’లో కలిసి నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ తో పాటు నాగార్జున, డింపుల్ కపాడియా, మౌనీ రాయ్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ రూపొందిస్తున్న ‘గంగూబాయి ఖతియావాడి’లోనూ, పాన్ ఇండియా మూవీ ‘ట్రిపుల్ ఆర్’లోనూ, ‘డార్లింగ్స్’, ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ మూవీస్ లోనూ అలియా భట్ నటిస్తోంది. రణబీర్ ‘షంషేరా’తో పాటు ఇంకా పేరు నిర్ణయించని లవ్ రంజన్ యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు.

Exit mobile version