కట్స్ లేకుండానే జనం ముందుకు జేమ్స్ బాండ్!

జేమ్స్ బాండ్ మూవీస్ అంటే లిప్ టు లిప్ కిస్ సీన్స్ ఉంటాయి. అలానే శృంగార సన్నివేశాలూ ఉంటాయి. దాంతో ఇండియాలో బాండ్ మూవీస్ కు నేచురల్ గా సెన్సార్ మెంబర్స్ కట్స్ వేస్తుంటారు. 2015లో బాండ్ మూవీ విడుదలైనప్పుడు అందులోని సుదీర్ఘ చుంబన సన్నివేశంపై వేటు పడింది. దానిని కేవలం 22 సెకన్లకు కుదించాల్సింది సెన్సార్ సభ్యులు కోరారు. అప్పటి సి.బి.ఎఫ్.సి. ఛైర్మన్ పంకజ్ నిహ్లానీ కూడా దాన్ని సమర్థించాడు. సెక్సీయెస్ట్ గా ఉండే తమ జేమ్స్ బాండ్ ను సంస్కారిగా సెన్సార్ సభ్యులు మార్చేశారనే అక్కసుతో కినుక వహించిన బాండ్ అభిమానులు ‘సంస్కారీ జేమ్స్ బాండ్’, ‘సంస్కారి సెన్సార్ బోర్డ్’ అనే హ్యాష్ ట్యాగ్స్ తో సోషల్ మీడియా హంగామా చేశారు.

Read Also : బిగ్ బాస్ 5 : ప్రియాకు సింపతీ క్రియేట్ అవుతుందా?

మరి ఈసారి ఈ వివాదాలన్నీ ఎందుకు అనుకుందో ఏమో సెన్సార్ బోర్డ్ ఎలాంటి కట్స్ లేకుండా లేటెస్ట్ బాండ్ మూవీ ‘నో టైమ్ టు డై’కు ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చేసింది. సో… ఈ నెల 30న జేమ్స్ బాండ్ ఎలాంటి కట్స్ లేకుండా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమా రన్ టైమ్ ను గం. 2.43 నిమిషాలకు లాక్ చేశారు. జేమ్స్ బాండ్ చిత్రాలలో అధిక నిడివి ఉన్న సినిమా ఇదే. అయితే థ్రిల్ కు గురిచేసే సన్నివేశాలు, ఆకట్టుకునే యాక్షన్ సీన్స్ ఉంటే… ఈ రన్ టైమ్ పెద్దంత భారంగా ఆడియెన్స్ కు అనిపించకపోవచ్చు. త్రీడీలోనూ తెరకెక్కిన ‘నో టైమ్ టు డై’ మూవీ ఇండియాలో వివిధ భాషలలో 1700 లకు పైగా థియేటర్లలో ప్రదర్శితం కాబోతోంది.

-Advertisement-కట్స్ లేకుండానే జనం ముందుకు జేమ్స్ బాండ్!

Related Articles

Latest Articles