NTV Telugu Site icon

Alia Bhatt: ‘వండర్ విమెన్’ కు తెలుగు నేర్పిన అలియా.. మీకు నా ముద్దులు అంటూ రచ్చ

Alia

Alia

Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. వండర్ విమెన్ గాల్ గాడోట్ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హార్ట్ ఆఫ్ స్టోన్. జామీ డోర్నన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అలియా విలన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాకు టామ్ హార్పర్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఆగస్టు 11 నుంచి అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగాన్ని పెంచేశారు. ఈ నేపథ్యంలోనే గాల్ గాడోట్, జామీ డోర్నన్‌ తో అలియా ఒక ఇంటర్వ్యూ చేసింది. ఇందులో సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

Guntur Kaaram: మహేష్ బర్త్ డే గిఫ్ట్ లేనట్టే.. ఇక ఆశలు వదిలేయడమే

ఇక ఈ ఇంటర్వ్యూలో అలియా తెలుగు మాట్లాడి ఆశ్చర్యపరచడమే కాకుండా వండర్ విమెన్ కు తెలుగు నేర్పించి షాక్ ఇచ్చింది. జక్కన్న చెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగుతెరకు పరిచయామైంది అలియా. అందరి హీరోయిన్స్ లా కాకుండా ఆర్ఆర్ఆర్ ఈవెంట్ లో చక్కగా తెలుగులో మాట్లాడి అభిమానుల మనసులను దోచేసింది. ” అందరికి నమస్కారం.. మీకు నా ముద్దులు” అంటూ అప్పట్లో అలియా చెప్పిన ముద్దు ముద్దు మాటలకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇప్పుడు అవే మాటలను వండర్ విమెన్ గాల్ గాడోట్ కు నేర్పించి ఔరా అనిపించింది. ఇక గాల్ గాడోట్ కూడా అలియా చెప్పిన విధంగా అందరికీ నమస్కారం చెప్పి ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో అలియా హాలీవుడ్ లో పాతుకుపోతుందో లేదో చూడాలి.

Show comments