Site icon NTV Telugu

Alia Bhatt :నోరు జారిన ఆలియా భట్.. నెట్టింట వివాదం..!

Aliya

Aliya

మాట మాట్లాడే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించు అని అంటారు. ముఖ్యంగా సెలబ్రెటిలు నోరు జారితే అయిపోయినట్లే. వారిని టార్గెట్ చేయడానికి సోషల్ మీడియా రెడీగా ఉంటుంది. ప్రజంట్ బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ చేసిన కామెంట్స్ ఈ రోజు నెట్టింట పెద్ద వివాదానికి కారణమయ్యారు. అసలు విషయం ఏంటంటే..

Also Read : Mohan Babu : ప్యారడైజ్‌ సెట్‌లో మోహన్‌బాబు ఎంట్రీ!

ఇటీవల మిలాన్‌లో జరిగిన గూచీ స్ప్రింగ్/సమ్మర్ 2026 ఫ్యాషన్ షోలో, ఆలియా తన తాజా చిత్రం ‘ఆల్ఫా’ను తన మొదటి యాక్షన్ మూవీగా ప్రస్తావించారు. గూచీ గ్లోబల్ అంబాసిడర్‌గా హాజరైన ఆమె, ఈ ప్రాజెక్ట్ పట్ల తన ఉత్సాహం, కొంత భయం కూడా ఉందని వ్యక్తం చేశారు. కానీ నెట్టింట ఇది వైరల్ అవ్వడంతో, ప్రేక్షకులు ఆలియా భట్ మునుపటి యాక్షన్ పాత్రలను మర్చిపోయారని విమర్శిస్తున్నారు. ఆమె ‘రాజీ’, ‘జిగ్రా’ వంటి చిత్రాలలో కూడా బలమైన యాక్షన్ సన్నివేశాలు చేశారు. అదేవిధంగా, హాలీవుడ్ మూవీలో ‘హార్ట్ ఆఫ్ స్టోన్’లో కూడా ఆమె యాక్షన్ సామర్థ్యాన్ని చూపించారు. మరి అలాంటప్పుడు..

ఆలియా గత చిత్రాలు పక్కన పెట్టి ‘ఆల్ఫా’ ని మాత్రమే తన మొదటి యాక్షన్ మూవీ గా చెప్పడం తగినది కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆమె అభిమానులు మాత్రం దీన్ని ప్రస్తుత యాక్షన్ సినిమా నేపథ్యంలో అర్థం చేసుకుంటున్నారు.‘జిగ్రా’లో యాక్షన్ పరిమితంగా ఉంది,‘రాజీ’ లో పోరాటం కన్నా కథ ఎక్కువగా ఉంది. కాబట్టి, ‘ఆల్ఫా’ పూర్తిగా యాక్షన్ కోసం రూపొందిన చిత్రం కాబట్టి ఆమె దీన్ని తన మొదటి యాక్షన్ మూవీగా పేర్కొన్నట్లు మద్దతు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Exit mobile version