Site icon NTV Telugu

Alia Bhatt: లేడీ ‘యానిమల్’ గా మారనున్న ఆర్ఆర్ఆర్ బ్యూటీ..?

Alia Bhatt

Alia Bhatt

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక దీంతో స్టార్ హీరోలందరూ, సందీప్ రెడ్డితో సినిమా చేయడానికి క్యూ కట్టిన విషయం తెలిసిందే.. కానీ ఈ డైరెక్టర్ మాత్రం వారందరిని కాదని బాలీవుడ్ లో పాగా వేయడానికి బయల్దేరాడు. అర్జున్‌ రెడ్డి రీమేక్‌గా బాలీవుడ్‌లో కబీర్‌ సింగ్‌తో అడుగుపెట్టిన సందీప్ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2023 ఆగస్టు 11న రిలీజ్ కానుంది. గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాపై మరింత హైప్ పెంచే ఒక వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో రణబీర్ సరసన అతడి ప్రేయసి, కాబోయే భార్య అలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్నదట. ఇప్పటికే ఈ జంట బ్రహ్మాస్త్రలో సందడి చేస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ చిత్రంలో కూడా అలియానే హీరోయిన్ గా కన్ఫర్మ్ చేశాడట సందీప్ రెడ్డి వంగా.. త్వరలోనే మేకర్స్ ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించనున్నారట. ఏదిఏమైనా అలియా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది అనడంలో సందేహం లేదు మొన్నటికి మొన్న గంగూభాయ్ తో రికార్డులను కొల్లగొట్టి, నిన్నటికి నిన్న ఆర్ఆర్ఆర్ తో ఆ రికార్డులను తిరగరాసి.. ఇక ఇప్పుడు మరోసారి రికార్డులను బద్దలుకొట్టే సినిమాలో నటిస్తుంది. మరి ఈ లేడీ యానిమల్ ని ఏ రేంజ్ లో చూపించనున్నాడో సందీప్ వంగా చూడాలి అంటున్నారు అభిమానులు.

Exit mobile version