Alia Bhatt: లేడీ ‘యానిమల్’ గా మారనున్న ఆర్ఆర్ఆర్ బ్యూటీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక దీంతో స్టార్ హీరోలందరూ, సందీప్ రెడ్డితో సినిమా చేయడానికి క్యూ కట్టిన విషయం తెలిసిందే.. కానీ ఈ డైరెక్టర్ మాత్రం వారందరిని కాదని బాలీవుడ్ లో పాగా వేయడానికి బయల్దేరాడు. అర్జున్ రెడ్డి రీమేక్‌గా బాలీవుడ్‌లో కబీర్ సింగ్‌తో అడుగుపెట్టిన సందీప్ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2023 ఆగస్టు 11న రిలీజ్ కానుంది. గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాపై మరింత హైప్ పెంచే ఒక వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో రణబీర్ సరసన అతడి ప్రేయసి, కాబోయే భార్య అలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్నదట. ఇప్పటికే ఈ జంట బ్రహ్మాస్త్రలో సందడి చేస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ చిత్రంలో కూడా అలియానే హీరోయిన్ గా కన్ఫర్మ్ చేశాడట సందీప్ రెడ్డి వంగా.. త్వరలోనే మేకర్స్ ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించనున్నారట. ఏదిఏమైనా అలియా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది అనడంలో సందేహం లేదు మొన్నటికి మొన్న గంగూభాయ్ తో రికార్డులను కొల్లగొట్టి, నిన్నటికి నిన్న ఆర్ఆర్ఆర్ తో ఆ రికార్డులను తిరగరాసి.. ఇక ఇప్పుడు మరోసారి రికార్డులను బద్దలుకొట్టే సినిమాలో నటిస్తుంది. మరి ఈ లేడీ యానిమల్ ని ఏ రేంజ్ లో చూపించనున్నాడో సందీప్ వంగా చూడాలి అంటున్నారు అభిమానులు.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!