Site icon NTV Telugu

Alia Bhatt: తల్లి కాబోతున్న ఆలియా.. స్వయంగా ప్రకటించిన బాలీవుడ్ స్టార్

Alia Bhatt

Alia Bhatt

బాలీవుడ్ ప్రముఖ నటులు రణ్‌బీర్‌కపూర్, ఆలియా భట్ తమ ప్రేమ బంధాన్ని ఇటీవల పెళ్లిగా మార్చుకున్న సంగతి తెలిసిన విషయమే. వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆలియాభట్ వరుసగా సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఆమె ప్రెగ్నెంట్ అని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పిక్‌ను ఆలియాభట్ షేర్ చేసింది. తమ బేబీ త్వరలో వస్తోంది అంటూ ఆమె రాసుకొచ్చింది. ఈ పిక్‌లో ఆలియా ఆస్పత్రిలోని బెడ్‌పై పడుకుని ఉండగా.. పక్కన టీవీ మానిటర్‌లో లవ్ సింబల్ కనిపిస్తోంది. పక్కనే భర్త రణ్ బీర్ కూడా ఉన్నాడు. దీంతో ఆమె తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పినట్లయ్యింది. కాగా రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ వివాహం ఏప్రిల్ 14న ముంబైలో ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరిద్దరూ బ్రహ్మాస్త్ర చిత్రంలో కలిసి నటిస్తున్నారు.

ఆలియా భట్ సినిమాల విషయానికి వస్తే.. ఆమె తన తండ్రి మహేష్ భట్ వారసత్వంగా సినిమాల్లోకి వచ్చింది. కేవలం వారసురాలు అనే ముద్రతో కాకుండా తనదైన నటనతో ఆలియా భట్ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఆమె నటించిన మొదటి సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’. ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. అనంతరం డియర్ జిందగీ, హైవే, రాజీ లాంటి సినిమాలు కూడా ఆలియా భట్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇటీవల ఆమె నటించిన ఆర్.ఆర్.ఆర్, గంగూబాయి కతియావాడి సినిమాలు కూడా ఘనవిజయం సాధించాయి. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో చిన్న పాత్రే అయినా ఆ పాత్రకు ఆలియా నిండుదనం తెచ్చిపెట్టింది. ఇక గంగూబాయి కతియావాడి మూవీలో వేశ్యగా నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

Exit mobile version