Site icon NTV Telugu

Alia Bhatt: ఎట్టకేలకు కూతురిని చూపించిన రణ్‌బీర్- అలియా.. ఎంత క్యూట్‌గా ఉందో..!

Alia Bhatt

Alia Bhatt

ఎట్టకేలకు తన కూతరిని పరిచయం చేసింది బాలీవుడ్ బ్యూటీ అలియా భట్. అలియా తల్లై ఏడాది గడిచిన ఇప్పటికీ కూతురిని మాత్రం పరిచయం చేయలేదు. పేరు రాహా అని మాత్రమే చెప్పింది. కానీ రాహాను మీడియాకు చూపించకుండ ఇంతకాలం దొబుచూలాడింది. దాంతో చాటుమాటుగా రాహాను ఫొటో తీసి వ్యూస్ సంపాదించాలని బాలీవుడ్ మీడియాలు ఎన్నో ప్రయత్నాలు చేశాయి. చాటుగా అలియా, రాహాలను క్లిక్ మనిపించాలని ట్రై చేసి దొరిపోయాయి.

Also Read: Dil Raju: సంక్రాంతికి వెనక్కి తగ్గేది వారే.. దిల్ రాజు ఓపెన్ కామెంట్స్!

‌అప్పుట్లో మీడియా తీరుపై అలియా, రణ్‌బీర్ గుర్రుమన్నారు కూడా. ఇక మీడియా ఎంత ట్రై చేసిన రాహా ఫొటోలు కానీ, వీడియో కానీ సాధించలేకపోయాయి. మరోవైపు అలియా కూతురిని ఎప్పుడు చూస్తామా అని అటూ అభిమానులు, ఇటూ నెటిజన్లు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఫైన‌ల్‌గా రాహాను నేరుగా మీడియా ముందుకు తీసుకువచ్చారు అలియా-రణ్‌బీర్. క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా తమ ఇంటి వద్దకు విచ్చేసిన విలేకర్లను పలకరించిన ఈ కపుల్ తమతో రాహాను కూడా తీసుకువచ్చారు.

Also Read: Salaar Child Artist: పృథ్వీరాజ్ చిన్నప్పటి క్యారెక్టర్ చేసింది రవితేజ కొడుకా.. అసలు విషయం ఇదే!

Alia Bhatt Daughter

ఈ సందర్భంగా తమ కుమార్తెను పరిచయం చేస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో రాహా చాలా క్యూట్‌గా ఉందని, అచ్చంగా అలియాను పోలి ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు. ఎంతోకాలంగా ప్రేమలో మునిగి తేలిన రణ్‌బీర్-అలియాలు గతేడాది ఏప్రిల్ 14న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అదే ఏడాది నవంబర్‌లో అలియా కూతురికి జన్మనిచ్చింది. కూతురికి రాహా అని నామకరణం చేసిన ఈ బాలీవుడ్ జంట ఏడాది తర్వాత కూతురిని పరిచయం చేసింది.

Exit mobile version